గాంధీ ఆస్పత్రి నుంచి తప్పించుకున్న ఖైదీల అరెస్ట్

గాంధీ ఆస్పత్రిలో కొవిడ్‌ చికిత్స పొందుతూ పరారైన ఇద్దరు ఖైదీలను చిలకలగూడ పోలీసులు అరెస్టు చేశారు.

  • Balaraju Goud
  • Publish Date - 5:33 pm, Fri, 6 November 20
గాంధీ ఆస్పత్రి నుంచి తప్పించుకున్న ఖైదీల అరెస్ట్

గాంధీ ఆస్పత్రిలో కొవిడ్‌ చికిత్స పొందుతూ పరారైన ఇద్దరు ఖైదీలను చిలకలగూడ పోలీసులు అరెస్టు చేశారు. చర్లపల్లి, చంచల్‌గూడ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న మహ్మద్‌ జావీద్‌, అబ్దుల్‌ అర్బాజ్‌, మంగలి సోమసుందరం, పర్వతం నర్సయ్యకు కరోనా సోకడంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు. గాంధీలోని రెండో అంతస్తులో ప్రిజనర్స్‌ వార్డులో చికిత్సపొందుతున్న ఎస్కార్ట్ సిబ్బంది కళ్లుగప్పి తప్పించుకున్నారు. ఆగస్టు 26న వీరంతా ఆస్పత్రిలోని బాత్‌రూం కిటికీ గుండా పారిపోయారు. దీంతో కేసు నమోదు చేసుకున్న చిలకలగూడ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఛివరికి బోరబండకు చెందిన మహ్మద్‌ జావీద్‌ అలియాస్‌ హక్లా జావీద్‌(35), మహ్మద్‌ అబ్దుల్‌ అర్బాజ్‌(22)ను బండ్లగూడ జహంగీరాబాద్‌ వద్ద చిలకలగూడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగలి సోమసుందరంను గతనెలలో బాలానగర్‌ సీసీఎస్‌ పోలీసులు పట్టుకున్నారు. మరో ఖైదీ పర్వతం నర్సయ్య కోసం పోలీసులు గాలిస్తున్నారు.