మహబూబ్‌నగర్ జిల్లాలో దారుణం.. ఇద్దరి కులాలు వేర్వేరు కావడంతో ఏం చేయాలో తెలియక..

మహబూబ్‌నగర్ జిల్లాలో ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు

  • Publish Date - 5:37 am, Sat, 19 December 20
మహబూబ్‌నగర్ జిల్లాలో దారుణం.. ఇద్దరి కులాలు వేర్వేరు కావడంతో ఏం చేయాలో తెలియక..

మహబూబ్‌నగర్ జిల్లాలో ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణపేట జిల్లా నర్వా మండలం లంకాల గ్రామానికి చెందిన శేఖర్, అదే గ్రామానికి చెందిన పదాహారేళ్ల బాలిక ఏడాది కాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి విషయం ఇరువురి ఇంట్లో తెలియడంతో తల్లిదండ్రులు మందలించారు. బాలిక మైనర్ కావడం, మళ్లీ ఇద్దరి కులాలు వేరుకావడంతో వీరి ప్రేమను పెద్దలు అంగీకరించలేదు. దీంతో ఈ నెల 15న ఈ ప్రేమజంట ఎవరికి చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయింది.

అయితే ఎక్కడికి వెళ్లినా వీరి ప్రేమకు అండగా నిలిచే వారు లేకపోవడంతో ఇద్దరు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. దీంతో ఆత్మహత్య చేసుకోవాలని భావించి కూల్‌డ్రింక్‌లో విషం కలుపుకొని తాగారు. మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం ఉంద్యాల సమీపంలో కూలీ పనులకు వెళుతున్న కూలీలకు విగత జీవులై కనిపించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించటంతో వారు కుటుంబ సభ్యులకు విషయాన్ని చేరవేశారు. అనంతరం సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.