Rahul Murder: మర్డర్‌ వెనుక మనీ మ్యాటర్.. రాహుల్‌ హత్యకేసులో పురోగతి.. ఆ నలుగురిపైనే డౌట్..

విజయవాడ వ్యాపారవేత్త రాహుల్‌ హత్యకేసులో పురోగతి సాధించారు పోలీసులు. రాహుల్‌ హత్యలో నలుగురి ప్రమేయం ఉన్నట్టు గుర్తించారు. కొరడ విజయ్‌కుమార్‌, కోగంటి సత్యం పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వ్యాపార లావాదేవీల్లో వివాదాలే హత్యకు కారణమని తెలుస్తోంది. కొరడ విజయ్‌కుమార్‌తో రెండేళ్లుగా రాహుల్‌ వ్యాపారం చేస్తున్నాడు. అయితే విజయ్‌కుమార్‌ ఆర్థికంగా నష్టపోవడంతో వివాదం తలెత్తినట్లుగా తెలుస్తోంది. మరింత సమాచారం సేకరించేపనిలో పడ్డారు. వ్యాపార భాగస్వామి పాత్ర ఉందని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. కేసులో నలుగురు నిందితుల పాత్ర ఉన్నట్లు నిర్ధారణకు వచ్చారు. […]

Rahul Murder: మర్డర్‌ వెనుక మనీ మ్యాటర్.. రాహుల్‌ హత్యకేసులో పురోగతి.. ఆ నలుగురిపైనే డౌట్..
Businessman Rahul
Follow us

|

Updated on: Aug 20, 2021 | 9:21 AM

విజయవాడ వ్యాపారవేత్త రాహుల్‌ హత్యకేసులో పురోగతి సాధించారు పోలీసులు. రాహుల్‌ హత్యలో నలుగురి ప్రమేయం ఉన్నట్టు గుర్తించారు. కొరడ విజయ్‌కుమార్‌, కోగంటి సత్యం పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వ్యాపార లావాదేవీల్లో వివాదాలే హత్యకు కారణమని తెలుస్తోంది. కొరడ విజయ్‌కుమార్‌తో రెండేళ్లుగా రాహుల్‌ వ్యాపారం చేస్తున్నాడు. అయితే విజయ్‌కుమార్‌ ఆర్థికంగా నష్టపోవడంతో వివాదం తలెత్తినట్లుగా తెలుస్తోంది. మరింత సమాచారం సేకరించేపనిలో పడ్డారు. వ్యాపార భాగస్వామి పాత్ర ఉందని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. కేసులో నలుగురు నిందితుల పాత్ర ఉన్నట్లు నిర్ధారణకు వచ్చారు. వీరిని పట్టుకునేందుకు ఐదు బృందాలను ఏర్పాటుచేశారు. మృతుడి తండ్రి రాఘవ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వీరిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

కెనడాలో చదివిన కరణం రాహుల్‌ స్వదేశానికి వచ్చి నాలుగేళ్ల క్రితం కృష్ణా జిల్లా జి.కొండూరు మండలం చెరువు మాధవరంలో సిలిండర్ల తయారీ కంపెనీ స్థాపించారు. ఇందులో ముగ్గురు భాగస్వాములున్నారు. ఇటీవల చిత్తూరు జిల్లా పుంగనూరులో మరో కంపెనీకి శంకుస్థాపన చేశారు.

పోరంకిలో నివాసం ఉంటున్నారు. అత్యవసరంగా మాట్లాడాలని ఫోన్‌ రాగా బుధవారం రాత్రి 7.30 సమయంలో రాహుల్‌ కారులో బయటకు వచ్చాడు. రాత్రి 9 గంటల సమయంలో ఇంట్లోవారు ఫోన్‌ చేస్తే స్విచాఫ్‌ అని వచ్చింది. గురువారం రోజు తెల్లవారిన తర్వాతా ఇంటికి రాకపోయేసరికి, రాహుల్‌ తండ్రి రాఘవ.. పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఇంతలో వైర్‌లెస్‌ సెట్లో మొగల్రాజపురంలో కారులో మృతదేహం ఉన్నట్లు సమాచారం మీడియాలో కనిపించింది. దీంతో హుటాహుటిన మాచవరం ఇన్‌ఛార్జి సీఐ సత్యనారాయణ, సెంట్రల్‌ ఏసీపీ ఖాదర్‌ బాషా అక్కడకు వెళ్లారు. మృతుడు రాహుల్‌ అని అతడి తండ్రి గుర్తించి భోరున విలపించారు కుటుంబ సభ్యులు.

రాహుల్‌ కెనడలో MS చేశాడు. ఆ తర్వాత ఏపీకి వచ్చి బిజినెస్‌ ప్లాన్ స్టార్ట్ చేశాడు. అందులో నుంచి పుట్టింది.. జిక్సిన్ సిలిండర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌. 2015లో స్టార్ట్ చేశాడు. ఇక 2017లో జిక్సిన్ ఇండస్ట్రీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్ మొదలు పెట్టాడు. 2018లో జిక్సిన్ ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్‌.. నెక్ట్స్‌ 2019లో జిక్సిన్ పేపర్స్‌ ప్రేవేట్‌ లిమిటెడ్‌ స్టార్ట్ చేశాడు. 2020లో జిక్సిన్ వెస్సల్స్ పేరుతో ఓ కంపెనీని పెట్టిన రాహుల్‌.. ఈ మధ్యే ఒంగోల్లోనూ ఇంకో కంపెనీకి శంకుస్థాపన చేశారు

ఇక ఈ ఆరు కంపెనీల వెనుక రాహుల్ ఒక్కడే లేడు. ఎండీగా కీరోల్‌లో ఉన్నా.. మరో ముగ్గురు పార్టనర్స్‌ కూడా ఉన్నారు. కొరడ విజయ్‌కుమార్‌, బొబ్బా స్వామికిరణ్, కరణం రాఘవరావు. ఇందులో మనం విజయ్ కుమార్‌ గురించి చెప్పుకోవాలి. బిజినెస్ చేస్తూనే రాజకీయాలపై ఆసక్తి ఉన్న వ్యక్తి ఇతను. 2019లో ఎన్నికల్లోనూ ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా పోటీ చేశాడు.. ఓడిపోయాడు.

ఇవి కూడా చదవండి: తాలిబన్లకు ఆ ప్రదేశం అంటే వణుకు.. కనీసం కన్నువేయడానికి కూడా వణికిపోతుంటారు.. ఎందుకో తెలుసా..

నల్లబంగారం ఎలా తయారు చేస్తారు.. గుర్తిపు పత్రం నుండి మార్కెట్ వరకు ప్రతిదీ తెలుసుకోండి..

Success Story: అబద్దం కాదు.. ఇది నిజం.. ముత్యాల సాగుతో లక్షలు ఆర్జిస్తున్న రైతు సంజయ్.. ఎక్కడో తెలుసా..