Vijayawada: రూ.150కి లీటర్‌ పెట్రోల్‌ కూడా రాలేదంటే.. పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు!

దేశంలో ఇంధన ధరలు పెరుగుతున్నాయి. నిత్యం సామాన్యుల చేతి చమురును వదిలిస్తున్నాయి. ఫలితంగా కొంతమంది వాహనదారులు ఇంటివద్దనే తమ వాహనాలను విడిచిపెళ్లి ప్రజారవాణా బస్సులను ఉపయోగిస్తున్నారు

Vijayawada: రూ.150కి లీటర్‌ పెట్రోల్‌ కూడా రాలేదంటే.. పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు!
Follow us

|

Updated on: Apr 25, 2022 | 1:54 PM

దేశంలో ఇంధన ధరలు పెరుగుతున్నాయి. నిత్యం సామాన్యుల చేతి చమురును వదిలిస్తున్నాయి. ఫలితంగా కొంతమంది వాహనదారులు ఇంటివద్దనే తమ వాహనాలను విడిచిపెళ్లి ప్రజారవాణా బస్సులను ఉపయోగిస్తున్నారు. మరీ అవసరమైతే తప్ప వాహనాలను ఉపయోగించడం లేదు . ఈక్రమంలో పెట్రోల్‌ తక్కువగా వచ్చిందని అడిగినందుకు ఓ ద్విచక్ర వాహనదారుడిపై పెట్రోల్‌ బంక్‌ సిబ్బంది విరుచుకుపడ్డారు. ఏ మాత్రం దయాదాక్షిణ్యాలు లేకుండా పిడిగుద్దులతో దారుణంగా కొట్టారు. ఈ ఘటన విజయవాడ రూరల్‌ మండలం రామవరప్పాడులోని ఇండియన్‌ ఆయిల్‌ పెట్రోల్‌ బంక్‌ వద్ద చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గుణదల ప్రాంతానికి చెందిన వర్మ.. బంక్‌లో 150 రూపాయలు ఇచ్చి లీట్‌ పెట్రోల్‌ పోయించాడు. పెట్రోల్‌ తక్కువగా వచ్చిందని.. 150 రూపాయలకి లీటర్‌ కూడా రాలేదేంటని బంక్‌ సిబ్బందిని ఆయన ప్రశ్నించాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన సిబ్బంది మొత్తం మూకుమ్మడిగా ఆ వ్యక్తిపై దాడి చేశారు. దీంతో అతను స్పృహ తప్పి పడిపోయాడు. ఆ తర్వాత కొద్ది సేపటికి మళ్లీ స్పృహలోకి వచ్చాడు.

కాగా ఐఓసీ బంకులో వాహనదారుడిపై దాడి నేపథ్యంలో బంక్​ను డీఎస్‌వో తనిఖీ చేశారు. అక్కడ ఉన్న సీసీ టీవీలో ఘటన దృశ్యాలను పరిశీలించారు. పోలీసులు.. ఇరువర్గీయులను విచారించారు. కాగా వాహనదారుడి మీద దాడి ఘటనపై బంక్​ యాజమాన్యం స్పందించింది. కస్టమర్​పై మూకుమ్మడి దాడి అనేది నిజం కాదని.. అతని స్పృహ తప్పిపడిపోయాడనటంలోనూ వాస్తవం లేదని తెలిపింది. ‘వాహనదారుడు.. ఉదయం 8.42కి వచ్చి రూ.150 పెట్రోల్​ తీసుకెళ్లాడు. అనంతరం 10.30 గంటలకు మళ్లీ వచ్చి పెట్రోల్​ తక్కువగా ఉందంటూ వాదనకు దిగారు. ఈ క్రమంలో ఆపరేటర్​గా పనిచేస్తున్న ఓ అమ్మాయిని అసభ్యకర పదజాలంతో దూషించాడు. మూకుమ్మడి దాడి అనేది నిజం కాదు. తన తప్పును ఒప్పుకున్న వాహనదారుడు​.. తన ఫిర్యాదును వెనక్కి తీసుకున్నాడు’ అని యాజమాన్యం తెలిపింది.

Also Read: Second Hand Car: సెకండ్‌ హ్యాండ్‌ కారు కొనాలనుకుంటున్నారా..? ఐ20 రూ.5 లక్షల లోపే.. పూర్తి వివరాలు..!

CM Vs Governor: తేల్చుకుంటాం.. ఈ అధికారం ఎందుకు ఉండదు.. రాష్ట్ర గవర్నర్ అధికారాలపై డీఎంకే పోరుబాట..

CM Vs Governor: తేల్చుకుంటాం.. ఈ అధికారం ఎందుకు ఉండదు.. రాష్ట్ర గవర్నర్ అధికారాలపై డీఎంకే పోరుబాట..

తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదల తేదీ ఇదే
తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదల తేదీ ఇదే
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్