పాకిస్తాన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ రైల్వే క్రాసింగ్ వద్ద బస్సును అతి వేగంతో వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే ఫ్యామిలీకి చెందిన 29 మంది సిక్కు యాత్రికులు మృతి చెందారు. మరికొందరు తీవ్ర గాయాలపాలవ్వగా.. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. పంజాబ్ ప్రావిన్స్‌లోని షీకుపురా జిల్లా ఫరీదాబాద్ పట్టణంలో ఈ ఘటన జరిగింది. స్థానికులు చెబుతున్న వివరాల ప్రకారం.. ఒకే ఫ్యామిలీకి చెందిన 35 మంది యాత్రికులు మినీ బస్సులో నంకానా సాహెబ్‌కు వెళ్లారు. అక్కడ ప్రార్థనల అనంతరం గురుద్వారా సచ్ఛ సౌధాకు వెళ్లారు. ఈ క్రమంలో ఫరీదాబాద్ వద్ద రైల్వే క్రాసింగ్ దాటుతున్న సమయంలో కరాచీ-లాహోర్ షా హుస్సేన్ ఎక్స్‌ప్రెస్ రైలు ఢీ కొట్టింది.
ఎక్స్ ప్రెస్ రైలు ఢీ కొట్టడంతో బస్సు తునాతునకలయింది. దాదాపు రెండు కిలో మీటర్ల వరకూ బస్సును ముందుకు ఈడ్చుకెళ్లింది. కాగా రైలు పట్టాలకు ఇరువైపులా మృతదేహాలు చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. 29 మంది స్పాట్‌లోనే మరణించారు. కాగా సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
بریکنگ نیوز
ایک ہی سکھ خاندان کے انیس افراد شیخوپورہ ٹرین حادثہ میں جانبحق
#Sheikhupura #Trainaccident #Sikh pic.twitter.com/H2fxicW5Kt
— Mamoon Ch (@MamoonCh_) July 3, 2020
బ్రేకింగ్: జులై 31 వరకు ఇంటర్నేషనల్ విమానాలు రద్దు
ఇక తెలంగాణలో ర్యాపిడ్ టెస్టులు.. అరగంటలో రిజల్ట్..