ఇంట్లోకి చొరబడ్డ కోతులు..బంగారం చోరీ

తెలంగాణలోని పలు జిల్లాలో కోతులు చేస్తున్న వీరంగం అంతా ఇంతా కాదు..ఊళ్లు, గ్రామాలపై పడి వానరాలు బీభత్సం స‌ృష్టిస్తున్నాయి. తాజాగా ఆసిఫాబాద్ జిల్లాలో ఓ ఇంట్లో చొరబడ్డ కోతులు ఏం చేశాయో తెలిస్తే మీరు కూడా షాక్ తింటారు..

ఇంట్లోకి చొరబడ్డ కోతులు..బంగారం చోరీ
Follow us

|

Updated on: Mar 03, 2020 | 7:39 AM

తెలంగాణలోని పలు జిల్లాలో కోతులు చేస్తున్న వీరంగం అంతా ఇంతా కాదు..ఊళ్లు, గ్రామాలపై పడి వానరాలు బీభత్సం స‌ృష్టిస్తున్నాయి. ఇళ్లు, పంటపొలాలపై పడి తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. చిన్న పిల్లలు, వృద్ధులు, మహిళలు దారిన వెంట వెళ్లే ప్రయాణికులపై దాడి చేసి గాయపరిచిన సంఘటనలు చాలా జరిగాయి. బెడదను తగ్గించేందుకు ప్రభుత్వం కూడా భారీ యాక్షన్ ప్లాన్‌తో అనేక చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ కోతి చేష్టలు మాత్రం ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తాజాగా ఆసిఫాబాద్ జిల్లాలో ఓ ఇంట్లో చొరబడ్డ కోతులు బంగారు నగలతో ఉడాయించాయి.

జిల్లాలోని రెబ్బెన పట్టణంలో తహసీల్దార్‌ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న ఓ ఉద్యోగి ఇంట్లో సోమవారం మధ్యాహ్నం కోతులు చొరబడ్డాయి. ఇల్లంతా చిందరవందర చేశాయి. వంట గదిలో దూరిన కోతులు …పప్పు డబ్బాలు ఎత్తుకుని పరిగెత్తాయి.. అయితే.. ఆ డబ్బాలో సదరు ఉద్యోగి తల్లికి చెందిన రెండు తులాలు, కూతురుకు చెందిన తులం బంగారం చైన్‌ ఉన్నాయి. స్థానికుల సాయంతో చుట్టుపక్కల గాలించినా డబ్బాలు లభించలేదని భాదితులు వాపోయారు.