Brutal Murder: రూ. 120 చెల్లించమన్నందుకు.. మేనమామ హత్య.. కత్తితో దారుణంగా..

Brutal Murder: రూ. 120 చెల్లించమన్నందుకు.. మేనమామ హత్య.. కత్తితో దారుణంగా..

Nephew Murder Uncle : దేశంలోని పలు ప్రాంతాల్లో రోజురోజుకు దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. క్షణికావేశంలో చాలామంది విస్తుపోయే నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందరూ అసహ్యించుకునేలా

Shaik Madarsaheb

|

Jul 07, 2021 | 9:15 AM

Nephew Murder Uncle : దేశంలోని పలు ప్రాంతాల్లో రోజురోజుకు దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. క్షణికావేశంలో చాలామంది విస్తుపోయే నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందరూ అసహ్యించుకునేలా దాడులకు పాల్పడుతూ.. సొంత కుటుంబీకులనే బలితీసుకుంటున్నారు. తాజా రూ.120ల కోసం మొదలైన వివాదం.. సొంత కుటుంబసభ్యుడినే బలి తీసుకునే వరకూ వెళ్లింది. రూ.120 చెల్లించమన్నందుకు తన మేనమామనే హత్య చేశాడు ఓ ప్రభుద్ధుడు. ఈ దారుణ సంఘటన.. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో చోటుచేసుకుంది.

గ్యాలియర్‌లోని ఓల్డ్ కాంట్ పోలీస్ స్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలో కయూమ్ ఖాన్ చేపలను విక్రయించేవాడు. అతని మేనల్లుడు కల్లుఖాన్ సమీపంలో చేపల వేపుడును అమ్ముతూ జీవించేవాడు. ఆదివారం రాత్రి కల్లు ఖాన్ అతని మేనమామ దగ్గర రూ.120కి చేపలను విక్రయించి.. డబ్బులను చెల్లించలేదు. డబ్బులను అడిగిన మేనమామపై కల్లు ఖాన్ గొడవకు దిగాడు. దీంతో వారిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

ఈ క్రమంలో మేనల్లుడు కల్లుఖాన్.. కత్తితో మామ కయూమ్ ఖాన్‌పై దాడి చేశాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన కయూమ్‌ను స్థానికులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ కయూమ్ మరణించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన జరిగిన అనంతరం కల్లు ఖాన్ అక్కడినుంచి పరారయ్యాడు. దీంతో మృతుడి కుటుంబం నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Also Read:

Marriage: మాకేనా కరోనా నిబంధనలు.. వైన్ షాపు ఎదుట ఒక్కటైన నూతన జంట.. అసలేమైందంటే..?

ఈ తెగలో వింత ఆచారం..! కూతురి పెళ్లి చేస్తే వరకట్నంగా 21 విష సర్పాలు.. ఒకవేళ ఇవ్వకపోతే ఏం జరగుతుందో తెలుసా..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu