నగరంలో మేల్ ఎస్కార్ట్.. రోజుకు రూ.15 వేలిస్తామంటూ యువకులకు ఎర.. చివరకు..

హైదరాబాద్‌ కేంద్రంగా మేల్ ఎస్కార్ట్ అంటూ పెద్ద ఘరానా మోసానికి పాల్పడ్డాడో ప్రబుద్ధుడు. నెలకు రూ.50 వేల నుంచి లక్ష రూపాయల వరకు సంపాదించవచ్చంటూ.. వెబ్‌సైట్ ఆధారంగా ప్రకటనలు చేస్తూ.. యువకులను బురిడీకొట్టించాడు. లోకాంటో అడ్డగా ఈ మేల్ ఎస్కార్ట్ దందాకు తెరలేపాడు. అందులో అందమైన అమ్మాయిల ఫోటోస్ పెడుతూ.. వారందరికీ మేల్ ఎస్కార్ట్ అవసరమంటూ ప్రకటనలు చేసేవాడు. విధిలో భాగంగా డబ్బున్న అమ్మాయిలను, మహిళలను కలిసి.. వారిని సుఖపెడితే చాలని.. రోజుకు రూ.15 వేల వరకు […]

  • Tv9 Telugu
  • Publish Date - 1:13 pm, Thu, 30 January 20
నగరంలో మేల్ ఎస్కార్ట్.. రోజుకు రూ.15 వేలిస్తామంటూ యువకులకు ఎర.. చివరకు..

హైదరాబాద్‌ కేంద్రంగా మేల్ ఎస్కార్ట్ అంటూ పెద్ద ఘరానా మోసానికి పాల్పడ్డాడో ప్రబుద్ధుడు. నెలకు రూ.50 వేల నుంచి లక్ష రూపాయల వరకు సంపాదించవచ్చంటూ.. వెబ్‌సైట్ ఆధారంగా ప్రకటనలు చేస్తూ.. యువకులను బురిడీకొట్టించాడు. లోకాంటో అడ్డగా ఈ మేల్ ఎస్కార్ట్ దందాకు తెరలేపాడు. అందులో అందమైన అమ్మాయిల ఫోటోస్ పెడుతూ.. వారందరికీ మేల్ ఎస్కార్ట్ అవసరమంటూ ప్రకటనలు చేసేవాడు. విధిలో భాగంగా డబ్బున్న అమ్మాయిలను, మహిళలను కలిసి.. వారిని సుఖపెడితే చాలని.. రోజుకు రూ.15 వేల వరకు సంపాదించుకోవచ్చని అందులో ప్రకటించేవాడు.

ఈ మోసపూరిత ప్రకటనలు చూసిన యువకులు.. నిందితుడికి కాల్ చేసేవారు. అయితే ఈ క్రమంలో దుర్గాప్రసాద్ సదరు అమ్మాయిలు, మహిళల వద్దకు వెళ్లాలంటే.. కొన్ని షరతులు ఉన్నాయంటూ తెలిపేవాడు. తొలుత రూ.1000/- చెల్లిస్తేనే వారి వద్దకు పంపిస్తానంటూ తెలిపేవాడు. దీంతో ఆశపడ్డ యువకులంతా.. దుర్గాప్రసాద్ చెప్పినట్లు వింటూ.. అతని బ్యాంక్ అకౌంట్‌కు డబ్బులు పంపడం మొదలుపెట్టారు.

అయితే డబ్బులు అందిన తర్వాత వారి ఫోన్ నంబర్లను బ్లాక్ లిస్టులో పెడుతుండేవాడు. అయితే మోసపోయామని వారు గ్రహించినా.. చిన్నమొత్తంలో డబ్బే కదా అని.. లైట్ తీసుకుని.. పోలీసులకు కూడా సమాచారాన్ని తెలియజేయలేదు. అయితే ఇదే అదనుగా దుర్గాప్రసాద్ మరింత రెచ్చిపోయి ప్రకటనలు చేస్తూ మోసాలకు పాల్పడ్డాడు. అయితే కొందరు ఈ విషయంపై కేసు పెట్టడంతో.. పోలీసులు సీరియస్‌గా తీసుకోవడంతో.. అసలు విషయం బయటపడింది. దుర్గాప్రసాద్ బాధితుల్లో దాదాపు 1200 మంది ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.