జగిత్యాల జిల్లాలో విషాదం.. ప్రేమించిన యువతి ఆత్మహత్య.. తీవ్ర మనస్తాపంతో దుబాయ్‌లో యువకుడి బలవన్మరణం

ప్రేమకు దూరమవుతున్నానని యువతి.. ఆమె చావుకు తానే కారణమని, మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య.

జగిత్యాల జిల్లాలో విషాదం.. ప్రేమించిన యువతి ఆత్మహత్య.. తీవ్ర మనస్తాపంతో దుబాయ్‌లో యువకుడి బలవన్మరణం
Balaraju Goud

|

Jan 23, 2021 | 8:15 PM

Lovers suicide in Jagtial district : జగిత్యాల జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అతని ప్రేమకు దూరమవుతున్నానని యువతి ఆత్మహత్య చేసుకుంటే.. ఆమె చావుకు తానే కారణమని, మనస్తాపంతో యువకుడు.. ఇద్దరు ప్రేమికులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ విషాదకర ఘటన గొల్లపల్లి మండలం లక్ష్మీపూర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన మానాల రాకేష్(21) అనే యువకుడు దుబాయ్‌లో బతుకుదెరువు కోసం వెళ్లాడు. లింగంపల్లి గ్రామానికి చెందిన మనీషా గొల్లపల్లిలోని ఓ మోటార్ డ్రైవింగ్ స్కూల్లో పని చేస్తోంది. ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. కాగా, ఇటీవల ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఆమె చనిపోవడానికి తన ప్రమేయం కూడా ఉందని భావించిన రాకేష్ దుబాయ్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

కాగా, తన వల్ల ఓ యువతి ఆత్మహత్య చేసుకుందని రాకేష్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. సెల్ఫీ వీడియో తీసి అమ్మ నేను ఆత్మహత్య చేసుకుంటానని చెబుతూ.. దుబాయిలోని తాను పని చేసే క్యాంపులో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఇద్దరి కుటుంబాల్లో విషాదచాయలు అలుముకున్నాయి.

Read Also… దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో బర్డ్‌ఫ్లూ కలకలం.. మరిన్ని పక్షుల మ‌ృత్యువాత.. మహారాష్ట్రలో చనిపోయిన నెమళ్ల గుర్తింపు

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu