జస్ట్ మిస్..పడితే ఇంకేమైనా ఉందా బాస్!

బైరెడ్డిపల్లి: చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం కైగల్‌ వంతెనపై పెను ప్రమాదం తప్పింది. ఓ కంటెయినర్‌ లారీ అదుపుతప్పి రెయిలింగ్‌పైకి దూసుకెళ్లింది. వంతెనపై ప్రమాదకరంగా వేలాడుతూ రోడ్డుకు అడ్డంగా నిలిచిపోయింది.  అదృష్టవశాత్తూ కంటెయినర్‌ వంతెన రెయిలింగ్‌ను ఢీకొని ఆగిపోవడంతో డైవర్‌, అతని సహాయకుడు ప్రాణాలతో బయటపడ్డారు.ఈ ఘటనతో పలమనేరు-కుప్పం రహదారిపై రెండుకిలోమీటర్ల వరకు వాహనాలు నిలిచిపోయాయి. సుమారు ఐదు గంటల పాటు ట్రాఫిక్‌ స్తంభించింది. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని లారీని వంతెనపై నుంచి తరలించి ట్రాఫిక్‌ను […]

జస్ట్ మిస్..పడితే ఇంకేమైనా ఉందా బాస్!

బైరెడ్డిపల్లి: చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం కైగల్‌ వంతెనపై పెను ప్రమాదం తప్పింది. ఓ కంటెయినర్‌ లారీ అదుపుతప్పి రెయిలింగ్‌పైకి దూసుకెళ్లింది. వంతెనపై ప్రమాదకరంగా వేలాడుతూ రోడ్డుకు అడ్డంగా నిలిచిపోయింది.  అదృష్టవశాత్తూ కంటెయినర్‌ వంతెన రెయిలింగ్‌ను ఢీకొని ఆగిపోవడంతో డైవర్‌, అతని సహాయకుడు ప్రాణాలతో బయటపడ్డారు.ఈ ఘటనతో పలమనేరు-కుప్పం రహదారిపై రెండుకిలోమీటర్ల వరకు వాహనాలు నిలిచిపోయాయి. సుమారు ఐదు గంటల పాటు ట్రాఫిక్‌ స్తంభించింది. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని లారీని వంతెనపై నుంచి తరలించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.