కామారెడ్డి జిల్లాలో ఘోర ప్ర‌మాదం.. అదుపు త‌ప్పి బోల్తా ప‌డ్డ ట్రాక్ట‌ర్‌.. ముగ్గురు దుర్మ‌ర‌ణం

రోడ్డు ప్ర‌మాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. నిర్ల‌క్ష్యం, అతివేగం, మ‌ద్యం సేవించి వాహ‌నాలు న‌డ‌ప‌డం వ‌ల్ల ప్ర‌మాదాలు జ‌రిగి అమాయ‌కుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నారు. ప్ర‌తి రోజు....

కామారెడ్డి జిల్లాలో ఘోర ప్ర‌మాదం.. అదుపు త‌ప్పి బోల్తా ప‌డ్డ ట్రాక్ట‌ర్‌.. ముగ్గురు దుర్మ‌ర‌ణం
Subhash Goud

|

Dec 17, 2020 | 9:41 AM

రోడ్డు ప్ర‌మాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. నిర్ల‌క్ష్యం, అతివేగం, మ‌ద్యం సేవించి వాహ‌నాలు న‌డ‌ప‌డం వ‌ల్ల ప్ర‌మాదాలు జ‌రిగి అమాయ‌కుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నారు. ప్ర‌తి రోజు ఎన్నో రోడ్డు ప్ర‌మాదాలు జ‌రుగుతున్నాయి. తాజాగా కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. బిచ్కుంద మండ‌లం చిన్న దేవాడ స‌మీపంలో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో ముగ్గురు మృతి చెందారు.

ఓ ట్రాక్ట‌ర్ అదుపుత‌ప్పి బోల్తా ప‌డ‌టంతో ముగ్గురు మృతి చెంద‌గా, ఇద్ద‌రు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ప్ర‌మాదం జ‌రిగిన వెంట‌నే స్థానికులు, పోలీసులు ఘ‌ట‌న స్థ‌లానికి చేరుకుని క్ష‌త‌గాత్రుల‌ను చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. మృత‌దేహాల‌ను పోస్టుమార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించి, కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌డుతున్నారు.

అయితే వివాహ వేడుకకు ట్యాంకర్ ద్వారా నీటిని తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులు సాయిలు, మద్నూర్ కు చెందిన శంకర్, బిచ్కుందకు చెందిన సాయిలు గా గుర్తించారు. ఈ ప్రమాదం జరగడంతో పెళ్లింట విషాదం నెలకొంది. సంతోషంగా పెళ్లి వేడుక జరిగే సమయంలో విషాద ఘటన జరగడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu