లద్దాక్‌లో వీరమరణం పొందిన తెలంగాణ జవాన్

కొమురం భీం జిల్లా కాగజ్ నగర్‌లో విషాదం చోటుచేసుకుంది. పట్టణంలోని రిక్షా కాలనీకి చెందిన ఓ ఆర్మీ జవాన్ వీర మరణం పొందాడు. భారత్ - చైనా సరిహద్దు లద్దాక్‌లో విధులు నిర్వహిస్తున్న ఆర్మీ జవాన్ షాకిర్ హుస్సేన్ మ‌ృతిచెందాడు.

లద్దాక్‌లో వీరమరణం పొందిన తెలంగాణ జవాన్
Follow us

|

Updated on: Oct 17, 2020 | 5:10 PM

కొమురం భీం జిల్లా కాగజ్ నగర్‌లో విషాదం చోటుచేసుకుంది. పట్టణంలోని రిక్షా కాలనీకి చెందిన ఓ ఆర్మీ జవాన్ వీర మరణం పొందాడు. భారత్ – చైనా సరిహద్దు లద్దాక్‌లో విధులు నిర్వహిస్తున్న ఆర్మీ జవాన్ షాకిర్ హుస్సేన్(35) మ‌ృతిచెందాడు. కొమురం భీం జిల్లాకు చెందిన ఆర్మీ జవాను లద్దాక్ విధులు నిర్వర్తిస్తుండగా ఈ ఘటన జరిగింది. విషయం తెలిసి వీర జవాన్ కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు.

లఢఖ్‌లో కొండచరియలు విరిగిపడి కొమరం భీం జిల్లాలోని కాగజ్ నగర్‌కు చెందిన ఆర్మీ జవాన్ మహమ్మద్ షాకీర్ (35) చనిపోయారు. లద్దాక్‌లో ఆరుగురు సభ్యుల బృందం విధుల్లో ఉండగా కొండచరియలు విరిగిపడినట్లు తెలుస్తోంది. దీంతో షాకిర్ హుస్సేన్ మంచుకొండల్లో చిక్కుకుని మృతిచెందినట్లు సమాచారం. మహమ్మద్ షాకీర్ మరణించిన విషయం అతని కుటుంబ సభ్యులకు ఆర్మీ అధికారులు శనివారం సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే కాగజ్ నగర్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.