30 గంటల్లో 5 హత్యలు

గత కొంత కాలంగా తగ్గుముఖం పట్టిన నేరాలు..లాక్ డౌన్ సడలింపుతో మళ్లీ మొదలయ్యాయి. ఏకంగా ప్రతి 6 గంటలకు ఒక హత్య జరగడం ఆందోళన కలిగిస్తోంది.

30 గంటల్లో 5 హత్యలు

గత కొంత కాలంగా తగ్గుముఖం పట్టిన నేరాలు..లాక్ డౌన్ సడలింపుతో మళ్లీ మొదలయ్యాయి. ఏకంగా ప్రతి 6 గంటలకు ఒక హత్య జరగడం ఆందోళన కలిగిస్తోంది.
లాక్‌డౌన్‌ కాలంలో నేరాలు తగ్గుముఖం పట్టాయి. లాక్ డౌన్ కాలంలో నేరాలకు లాక్ డౌన్ పడింది. లాక్ డౌన్ విధించినప్పటి నుంచి గతంతో పోల్చితే నేరాల సంఖ్య గణనీయంగా తగ్గింది. రోడ్డు ప్రమాదాలు, హత్యలు, అత్యాచారాలు, చోరీలు, డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లు దాదాపు సున్నాగా నమోదయ్యాయి. హైదరాబాద్‌ సహా రాష్ట్రవ్యాప్తంగా నేరాలు తగ్గిపోయాయని స్వయంగా పోలీసులే ప్రకటించడమే దీనికి నిదర్శనం. దీంతో నిత్యం నేరస్థులను పట్టుకోవడంలో ఎప్పుడూ టెన్షగా ఉండే పోలీసులకు లాక్ డౌన్ కాలం కాస్తంత ఉపశమనాన్నిచ్చింది.
కానీ.. సడలింపులు మొదలవగానే పరిస్థితి మళ్లీ మొదటికొస్తోంది. లాక్ డౌన్ కాలంలో తగ్గుముఖం పట్టిన నేరాలు క్రమంగా పెరుగుతున్నాయి. పోలీసులు అప్రమత్తమయ్యేలోపే చాలా వరకు నేరాలు జరిగిపోతున్నాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో 30 గంటల వ్యవధిలోనే 5 హత్యలు జరగడం ఆందోళన రేకెత్తిస్తోంది. అంటే సరాసరిన ప్రతి 6 గంటలకో హత్య జరిగింది.