Councillor Suicide: సంగారెడ్డి జిల్లాలో విషాదం.. ఐడీఏ బొల్లారం వార్డు కౌన్సిలర్ ప్రమీల గౌడ్ ఆత్మహత్య..!

సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ ప్రజా ప్రతినిధి బలవన్మరణానికి పాల్పడింది. ఐడీఏ బొల్లారం మున్సిపాలిటీలోని 11వ వార్డు కౌన్సిలర్‌ మహ్మదాబాద్‌ ప్రమీల గౌడ్( 45) ఆత్మహత్య చేసుకున్నారు.

Councillor Suicide: సంగారెడ్డి జిల్లాలో విషాదం..  ఐడీఏ బొల్లారం వార్డు కౌన్సిలర్ ప్రమీల గౌడ్ ఆత్మహత్య..!
Bollaram Ward Councillor Prameela Goud

IDA Bollaram ward councillor Suicide: సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ ప్రజా ప్రతినిధి బలవన్మరణానికి పాల్పడింది. ఐడీఏ బొల్లారం మున్సిపాలిటీలోని 11వ వార్డు కౌన్సిలర్‌ మహ్మదాబాద్‌ ప్రమీల గౌడ్( 45) ఆత్మహత్య చేసుకున్నారు.. తన ఇంట్లోనే ఎవరు లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ప్రాణాలు విడిచింది. ఇది గమనించిన కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం…ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలే కారణమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు. భర్త యాదగిరి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పటాన్‌చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ప్రాంతంలోని హస్తీపూర్‌కు చెందిన ఆమె చాలాకాలంగా ఐడీఏ బొల్లారంలో ఉంటున్నారు. 2014లో కాంగ్రెస్‌ పక్షాన ఎంపీటీసీగా గెలుపొందారు. తర్వాత టీఆర్ఎస్‌లో చేరారు. 2020లో 11వ వార్డు కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. మృతురాలికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. కాగా, ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Read Also…  GHMC: వనస్థలిపురంలో విషాదం.. డ్రైనేజీ క్లీన్ చేస్తూ ఇద్దరు జీహెచ్ఎంసీ కార్మికుల గల్లంతు.. ఒకరి మృతదేహం లభ్యం!

BEL recruitment 2021: నిరుద్యోగులకు అలర్ట్.. 49 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. నేడే చివరి తేదీ..

 

Click on your DTH Provider to Add TV9 Telugu