హైదరాబాద్‌లో వెలుగుచూసిన మరో భారీ స్కాం.. మనీ సర్క్యులేషన్ పేరుతో రూ.1500 కోట్లు వసూలు..!

హైదరాబాద్‌ మహానగరంలో మరో భారీ స్కాం వెలుగులోకి వచ్చింది. భాగ్యనరం కేంద్రంగా మొదలైన మోసానికి సంబంధించిన నిందితులను తాజాగా హైదరాబాద్‌ పోలీసులు అరెస్ట్ చేశారు.

  • Balaraju Goud
  • Publish Date - 2:24 pm, Sat, 6 March 21
హైదరాబాద్‌లో వెలుగుచూసిన మరో భారీ స్కాం..  మనీ సర్క్యులేషన్ పేరుతో రూ.1500 కోట్లు వసూలు..!

Hyderabad money circulation scam : హైదరాబాద్‌ మహానగరంలో మరో భారీ స్కాం వెలుగులోకి వచ్చింది. భాగ్యనరం కేంద్రంగా మొదలైన మోసానికి సంబంధించిన నిందితులను తాజాగా హైదరాబాద్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. భారీ మనీ సర్క్యూలేషన్ స్కీమ్ స్కామ్‌ను సైబరాబాద్ ఎకనామకిల్ ఆపన్స్ వింగ్ బయటపెట్టింది. ఇండస్ వివా హెల్త్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ భారీ మోసానికి పాల్పడ్డట్లు పోలీసులు గుర్తించారు. దేశ వ్యాప్తంగా 10 లక్షల మందిని మోసం చేసినట్టు తేల్చారు. మనీ స్కీమ్ గ్యాంగ్ దాదాపు రూ.1500 కోట్ల డబ్బు వసూలు చేసినట్లు తెలుస్తోంది. కంపెనీ డైరెక్టర్స్ తోసహా 24 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివా సంస్థకు సంబంధించి రూ.20 కోట్లను పోలీసులు ఫ్రీజ్ చేశారు. సాయంత్రం మూడు గంటలకు నిందితులను పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు.

Read Also…  కేవలం బీర్ మాత్రమే తాగి తక్కువ సమయంలో 10 కిలోలు తగ్గిన వ్యాపారి.