లింగ నిర్థారణ పరీక్షలను ప్రభుత్వం నిషేధించినప్పటికీ.. వాటిని ధిక్కరించి ఓ గర్భిణికి జెండర్ టెస్ట్ నిర్వహించిన ఒక ఆసుపత్రి ఎండీ, ఇద్దరు డాక్టర్లను అరెస్ట్ చేశారు పోలీసులు. ఉప్పల్‌లోని ప్రైవేటు ఆస్పత్రి ఎండీ వీ ఆంజనేయులు, డాక్టర్లైన జే రాఘవ రెడ్డి, శ్రావణిలను అరెస్ట్ చేసినట్టు రాచకొండ పోలీసులు తెలిపారు. గర్భిణి అయిన ఓ మహిళా కానిస్టేబుల్‌కి లింగ నిర్థారణ పరీక్షలు నిర్వహించడానికి డాక్టర్ శ్రావణి రూ.15 వేలు డిమాండ్ చేశారని, డాక్టర్ రాఘవరెడ్డి ఆమెకు స్కానింగ్ తీశాడని తెలిసింది. కాగా స్కానింగ్‌లో ఆమెకు పుట్టబోయే బిడ్డ మగ బిడ్డా? కాదా? అన్న విషయం తెలిపాడట. అయితే ఇదంతా ఈ డాక్టర్లను ట్రాప్ చేయడానికేనని వెల్లడయ్యింది. జిల్లా మెడికల్, హెల్త్, రాచకొండ పోలీసులు పన్నిన వలలో ఈ ఆస్పత్రి ఎండీ, ఇద్దరు డాక్టర్లు పడ్డారు.
Read More:
సిటీ డీసీపీకి కరోనా.. పోలీసుల్లో మొదలైన కలవరం!
విద్యార్థులను నేరుగా పై తరగతికి ప్రమోట్ చేసిన ప్రభుత్వం
తెలంగాణలో జూన్ 12 నుంచి స్కూల్స్ ఓపెన్.. ఒక్కో గదిలో 20 మందే!
బ్రాహ్ముణులను కించపరిచిందని.. యాంకర్ శ్రీముఖిపై పోలీస్ కేసు..