సంపాదనేమో కోట్లకు కోట్లు వేసేవేమో చిల్లరవేషాలు

కొందరికి క్లెప్టమానియా అనే జబ్బుంటుంది… ఆ వ్యాధి ఉన్నవారికి ఏదో ఒకటి నొక్కేయాలనిపిస్తుంది… కోట్ల కొద్దీ సంపాదన ఉన్నా కక్కుర్తి పడేట్టు చేస్తుంది… మరి సిటీ గ్రూప్‌ బ్యాంక్‌లో సీనియర్‌ మేనేజర్‌గా పని చేస్తున్న పరాశ్‌ షాకు ఇలాంటి రోగముందో లేదో తెలియదు కానీ… అతగాడి చిలక్కొట్టుడు వ్యవహారం ఉద్యోగం ఊడేలా చేసింది.. సిటీ గ్రూప్‌ బ్యాంక్‌ అంటే మామూలు బ్యాంకు కాదు… యూరప్‌ బ్యాంకింగ్‌ లావాదేవీలతో అత్యధిక లాభాలను ఆర్జిస్తున్న బ్యాంక్‌… అందులో సీనియర్‌ మేనేజర్‌ […]

సంపాదనేమో కోట్లకు కోట్లు వేసేవేమో చిల్లరవేషాలు
Follow us

|

Updated on: Feb 04, 2020 | 8:32 PM

కొందరికి క్లెప్టమానియా అనే జబ్బుంటుంది… ఆ వ్యాధి ఉన్నవారికి ఏదో ఒకటి నొక్కేయాలనిపిస్తుంది… కోట్ల కొద్దీ సంపాదన ఉన్నా కక్కుర్తి పడేట్టు చేస్తుంది… మరి సిటీ గ్రూప్‌ బ్యాంక్‌లో సీనియర్‌ మేనేజర్‌గా పని చేస్తున్న పరాశ్‌ షాకు ఇలాంటి రోగముందో లేదో తెలియదు కానీ… అతగాడి చిలక్కొట్టుడు వ్యవహారం ఉద్యోగం ఊడేలా చేసింది.. సిటీ గ్రూప్‌ బ్యాంక్‌ అంటే మామూలు బ్యాంకు కాదు… యూరప్‌ బ్యాంకింగ్‌ లావాదేవీలతో అత్యధిక లాభాలను ఆర్జిస్తున్న బ్యాంక్‌… అందులో సీనియర్‌ మేనేజర్‌ అంటే ఇంకా మామూలు విషయం కాదు… ఏటా తొమ్మిదిన్నర కోట్ల రూపాయల జీతం … అంత సంపాదన ఉన్న పరాశ్‌ షా చిల్లరవేషాలేయడమేమిటి..? అంటే ఖర్మ… ఇంతకీ ఇతగాడు ఏం చేసేవాడంటే లండన్‌లోని కానరీ వార్ఫ్‌లో ఉన్న బ్యాంక్‌ హెడ్‌ ఆఫీసు నుంచి తరచుగా ఫుడ్‌ను దొంగలించేవాడు.. చాలాసార్లు శాండ్‌విచ్‌లను చోరీ చేశాడు.. ఎంతకాలం నుంచి ఇలా చేస్తున్నాడో తెలియదు కానీ.. ఓ ఫైన్‌ మార్నింగ్‌ మేనేజ్‌మెంట్‌కు ఈ విషయం తెలిసిపోయింది… అంతే…ఇక ఇప్పటికి దుకాణం సర్దేసుకోబాబు అంటూ ఉద్యోగంలోంచి సస్పెండ్‌ చేశారు.. పరాశ్‌ షా లైఫ్‌ స్టయిల్‌ చూస్తే అబ్బో అనిపిస్తుంది.

హాలీడేస్‌లో ఫారిన్‌ టూర్లకు వెళ్లడం ఇతగాడి హాబీ… పెరూలోని మాచుపిచ్చు దగ్గర దిగిన ఫోటోలను ఫేస్‌బుక్‌లో పెట్టుకున్నాడు కూడా! లండన్‌లోని ఎడ్మాంటన్‌ గ్రామర్‌ స్కూల్‌లో చదివిన పరాశ్‌ షా తర్వాత బాత్‌ యూనివర్సిటీలో ఎకనామిక్స్‌లో పట్టా పుచ్చుకున్నాడు. హెచ్‌ఎస్‌బీసీలో ఇన్‌కమ్‌ ట్రేడింగ్‌ బిజినెస్‌లో ఏడేళ్లపాటు పని చేశాడు.. మూడేళ్ల కిందట సిటీ గ్రూప్‌లో చేరాడు.. ఇంత టాప్ పొజిషన్‌లో ఉన్న పరాశ్‌ శాండ్‌విచ్‌లకు కక్కుర్తి పడటమేమిటన్న డౌటానుమానం చాలా మంది వస్తుంది…ఇతడే కాదు… టాప్‌ పొజిషన్‌లో ఉన్న చాలా మందికి ఇలాంటి వింత జబ్బు ఉంటుంది… ఇలా చేతి దురద ఉన్న ఓ లండన్‌ బ్యాంకర్‌ తన ఫ్రెండ్‌ బైక్‌ నుంచి 5 వందల రూపాయలు కూడా చేయని ఓ పార్ట్‌ను దొంగలించాడు… ఇది తెలుసుకున్న జపాన్‌కు చెందిన ముజువో బ్యాంక్‌ ఉన్నపళంగా అతడిని ఉద్యోగం నుంచి తీసేసింది… ఇతను నయం … బ్లాక్‌రాక్‌ ఎగ్జిక్యూటివ్‌ జోనాధన్‌ బుర్రోస్‌ది అయితే మరీ పిసినారితనం… రైల్లో టికెట్‌ లేకుండా ప్రయాణిస్తూ అడ్డంగా దొరికిపోయాడు.. ఇంటా బయటా బోల్డన్ని విమర్శలు.. వెక్కిరింతలు రావడంతో ఓ 39 లక్షల రూపాయలు వదిలించుకుని బ్రిటన్‌ ఆగ్నేయ రైల్వేతో రాజీ కుదుర్చుకున్నాడు.. అయినా పడిన మచ్చ అయితే చెరిగిపోదుగా…!