Guntur Tapasvi Murder Case: తపస్వి మర్డర్ కేసులో ఆ అమ్మాయే కీలకం.. హత్య వెనుక అసలు మిస్టరీ ఏంటి?

గుంటూరు తపస్వి మర్డర్ కేసులో ఓ అమ్మాయి కీలకంగా మారింది. తపస్విపై జ్ఞానేశ్వర్‌ ఎటాక్‌ చేసినప్పుడు ఆమే ప్రత్యక్ష సాక్షిగా ఉంది. ఎటాక్‌ తర్వాత తపస్విని హాస్పిటల్‌లో అడ్మిట్‌చేసిన ఆ..

Guntur Tapasvi Murder Case: తపస్వి మర్డర్ కేసులో ఆ అమ్మాయే కీలకం.. హత్య వెనుక అసలు మిస్టరీ ఏంటి?
Guntur Tapasvi Murder Case
Follow us

|

Updated on: Dec 06, 2022 | 9:54 PM

గుంటూరు తపస్వి మర్డర్ కేసులో ఓ అమ్మాయి కీలకంగా మారింది. తపస్విపై జ్ఞానేశ్వర్‌ ఎటాక్‌ చేసినప్పుడు ఆమే ప్రత్యక్ష సాక్షిగా ఉంది. ఎటాక్‌ తర్వాత తపస్విని హాస్పిటల్‌లో అడ్మిట్‌చేసిన ఆ అమ్మాయి ఆ తర్వాత అక్కడ్నుంచి మాయమైంది. ఇంతకీ, ఆమె ఎవరు?. ఎందుకు అక్కడుంది?. తపస్వి మర్డర్ వెనక అసలు మిస్టరీ ఏంటి? ఈ మర్డర్ కేసులో కీలక విషయాలు బయటికొస్తున్నాయ్‌. తపస్విపై జ్ఞానేశ్వర్‌ ఎటాక్‌ చేసినప్పుడు ఆమె ఫ్రెండ్‌ విభ కూడా రూమ్‌లోనే ఉన్నట్టు గుర్తించారు పోలీసులు. ఇద్దరికీ జ్ఞానేశ్వర్‌తో పరిచయం ఉన్నట్లు తేలింది. వీళ్లిద్దరూ రూమ్‌లో ఉండగానే లోపలికొచ్చిన జ్ఞానేశ్వర్‌… పెళ్లి చేసుకుంటావా? లేదా? అంటూ తపస్విని బెదిరించడం, ఆమె ససేమిరా అనడం, సర్జికల్‌ బ్లేడ్‌తో ఎటాక్‌ చేయడం అన్నీ క్షణాల్లో జరిగిపోయాయ్‌. అయితే ఈ మొత్తం ఎపిసోడ్‌లో విభానే ప్రత్యక్ష సాక్షి కావడంతో ఈ కేసులో ఆమె కీలకంగా మారింది.

తపస్విని హాస్పిటల్‌లో అడ్మిట్‌చేసి అక్కడ్నుంచి వెళ్లిపోయింది విభ.. సడన్‌గా పెదకాకాని పీఎస్‌లో ప్రత్యక్షమైంది. విభ కోసం గాలిస్తున్నారని తెలుసుకున్న కుటుంబ సభ్యులు, ఆమెను పోలీస్‌స్టేషన్‌కి తీసుకొచ్చారు. అయితే, తపస్వి డెత్‌తో విభ షాక్‌లో ఉందంటున్నారు పోలీసులు. తపస్వి పేరెంట్స్‌ను పరామర్శించిన మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ కీలక కామెంట్స్‌ చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్ ప్రేమలు ప్రాణాలు తీస్తున్నాయన్నారు.

ప్రేమోన్మాది జ్ఞానేశ్వర్‌ విచక్షణారహితంగా ఎటాక్‌ చేసినట్టు పోస్టుమార్టం రిపోర్ట్‌లో తేలింది. తపస్వి గొంతు కింద రెండు లోతైన గాయాలు, శరీరం ఎడమవైపు మరో రెండు బలమైన కత్తి గాట్లు, భుజంపై మరో లోతైన గాయాన్ని గుర్తించారు డాక్టర్లు. సర్జికల్‌ బ్లేడ్‌తో శరీరం మొత్తం గాయాలు చేసిన జ్ఞానేశ్వర్‌.. ఐదుచోట్ల మాత్రం బలంగా పొడిచాడు. అవే తపస్వి ప్రాణాలు పోవడానికి కారణమని తేల్చారు వైద్యులు.

ఇవి కూడా చదవండి

342, 452, 302 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుడు జ్ఞానేశ్వర్‌ను రేపు కోర్టులో హాజరుపర్చనున్నారు. అయితే, తపస్విపై ఎటాక్‌ ఎలా జరిగింది? అంతకు ముందు ఏ జరిగింది? ఎప్పట్నుంచి పరిచయం? వీటిన్నింటికీ విభానే ప్రత్యక్ష సాక్షి కావడంతో ఆమె నోరు విప్పితేనే కేసు మిస్టరీ మొత్తం వీడనుంది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..