సమాజం సిగ్గుతో తలవంచుకోవాలి.. ఢిల్లీ పోక్సో కోర్టు జడ్జి సంచలన వ్యాఖ్య

2013 లో ఢిల్లీలో అయిదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన ఇద్దరిని  ఈ నగరంలోని పోక్సో కోర్టు దోషులుగా ప్రకటించింది. నిర్భయ దారుణ ఘటన అనంతరం నాలుగు నెలలకే మరింత ఘోరంగా జరిగిన నేరమిది.  మనోజ్ షా, ప్రదీప్ కుమార్ అనే ఈ ఇద్దరినీ పోలీసులు ఈ కోర్టులో శనివారం హాజరుపరచగా.. న్యాయమూర్తి కూడా ఈ అమానుష ఘటనపై చలించిపోయారు.  ఈ సమాజంలో మైనర్ బాలికలను దేవతలుగా పూజిస్తారని, అలాంటిది ఈ కేసులో ఈ బాలిక అనుభవించిన నరకయాతన […]

సమాజం సిగ్గుతో తలవంచుకోవాలి.. ఢిల్లీ పోక్సో కోర్టు జడ్జి సంచలన వ్యాఖ్య
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Jan 18, 2020 | 6:58 PM

2013 లో ఢిల్లీలో అయిదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన ఇద్దరిని  ఈ నగరంలోని పోక్సో కోర్టు దోషులుగా ప్రకటించింది. నిర్భయ దారుణ ఘటన అనంతరం నాలుగు నెలలకే మరింత ఘోరంగా జరిగిన నేరమిది.  మనోజ్ షా, ప్రదీప్ కుమార్ అనే ఈ ఇద్దరినీ పోలీసులు ఈ కోర్టులో శనివారం హాజరుపరచగా.. న్యాయమూర్తి కూడా ఈ అమానుష ఘటనపై చలించిపోయారు.  ఈ సమాజంలో మైనర్ బాలికలను దేవతలుగా పూజిస్తారని, అలాంటిది ఈ కేసులో ఈ బాలిక అనుభవించిన నరకయాతన చెప్పనలవికాదని అన్నారు. ఈ విధమైన సంఘటనలను చూసి సమాజం సిగ్గుతో తలవంచుకోవాలని అభిప్రాయపడ్డారు. వీరికి ఎలాంటి శిక్ష విధించాలన్న దాన్ని ఈ నెల 30 న నిర్ణయించనున్నారు.  సుమారు ఏడేళ్ల క్రితం ఢిల్లీలో గుడియా (పేరు మార్చారు) అనే బాలికపై అత్యాచారానికి పాల్పడి బీహార్ పారిపోయిన ఈ ఇద్దరినీ ఢిల్లీ పోలీసులు వేర్వేరు చోట్ల అరెస్టు చేశారు. 2013 మే 24 న చార్జిషీట్ దాఖలు కాగా.. జులై 11 న వీరిపై  అభియోగాలు నమోదు చేశారు. అయితే పోక్సో కోర్టులో 57 మంది ప్రాసిక్యూషన్ సాక్షుల వాంగ్మూలాలను రికార్డు చేయడానికి ఐదేళ్లకు పైగా పట్టింది. కాగా.. శనివారం కోర్టు రూమ్ నుంచి  ఈ ఇద్దరినీ బయటకు తీసుకువస్తుండగా మనోజ్ షా.. కొందరు రిపోర్టర్లపై దాడికి యత్నించాడు..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu