చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో మరోసారి పట్టుబడ్డ బంగారం

చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి బంగారం పట్టుబడింది. రూ.84 లక్షల విలువగల బంగార్ని పేస్టు రూపంలో తరలిస్తున్న ముఠా పట్టుబడ్డ మరుసటి రోజే.. మరో ముఠా కూడా కస్టమ్స్ అధికారులకు..

చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో మరోసారి పట్టుబడ్డ బంగారం

చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి బంగారం పట్టుబడింది. రూ.84 లక్షల విలువగల బంగార్ని పేస్టు రూపంలో తరలిస్తున్న ముఠా పట్టుబడ్డ మరుసటి రోజే.. మరో ముఠా కూడా కస్టమ్స్ అధికారులకు చిక్కింది. దుబాయి నుంచి చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో దిగిన ఇద్దరు వ్యక్తుల వద్ద నుంచి 731 గ్రాముల బంగారాన్ని గుర్తించారు. దీని విలువ రూ.34.5 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. బంగారాన్ని ఓ ప్లాస్టిక్‌ కవర్‌లో పెట్టి.. దానిని జీన్స్‌ పాయింట్ బెల్ట్ పెట్టుకునే భాగంలో అమర్చి స్మగ్లింగ్‌కు పాల్పడ్డారు. పట్టుబడ్డ ఇద్దరు నిందితులు తంజావురుకు చెందిన వారిగా గుర్తించారు. వీరిద్దర్నీ అరెస్ట్ చేసిన కస్టమ్స్‌ అధికారులు విచారణ చేపడుతున్నారు.

Read More :

ఏపీలో కరోనా విలయం.. మళ్లీ 10 వేలకు పైగానే కేసులు

సరిహద్దు భద్రతలో మహిళా జవాన్లు

పూంచ్‌ జిల్లా సరిహద్దుల్లో కాల్పులకు దిగిన పాక్‌

Click on your DTH Provider to Add TV9 Telugu