అనకాపల్లిలో యువతిపై దాడి కేసులో మరో కోణం?

అనకాపల్లిలో యువతిపై దాడి కేసులో మరో కోణం?
young man attacked on degree student bhargavi for rejecting love

అనకాపల్లిలోని రామచంద్ర థియేటర్ దగ్గర విద్యార్థినిపై జరిగిన దాడి కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వారిద్దరి చాలా రోజులుగా ప్రేమించుకుంటున్నారని..అనుమానంతో ప్రేమించిన అమ్మాయిపై కత్తితో దాడి చేశాడని సమాచారం. భీమునిగుమ్మం ప్రాంతానికి చెందిన నాగసాయి అనే యువకుడు డిగ్రీ విద్యార్థిని యశోద భార్గవిని ప్రేమించాడు. వారి పెళ్లికి ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించారు. అయితే పెళ్లికి ముందు ఏదైనా ఉద్యోగం చూసుకోమని పెద్దలు నాగసాయికి సూచించారు. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న నాగసాయి ఇటీవల ప్రియురాలిపై అనుమానం […]

Ram Naramaneni

|

Aug 29, 2019 | 4:42 AM

అనకాపల్లిలోని రామచంద్ర థియేటర్ దగ్గర విద్యార్థినిపై జరిగిన దాడి కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వారిద్దరి చాలా రోజులుగా ప్రేమించుకుంటున్నారని..అనుమానంతో ప్రేమించిన అమ్మాయిపై కత్తితో దాడి చేశాడని సమాచారం. భీమునిగుమ్మం ప్రాంతానికి చెందిన నాగసాయి అనే యువకుడు డిగ్రీ విద్యార్థిని యశోద భార్గవిని ప్రేమించాడు. వారి పెళ్లికి ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించారు. అయితే పెళ్లికి ముందు ఏదైనా ఉద్యోగం చూసుకోమని పెద్దలు నాగసాయికి సూచించారు.

ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న నాగసాయి ఇటీవల ప్రియురాలిపై అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలో కళాశాల నుంచి ఇంటికి వెళ్తున్న ఆమెపై ఓ థియేటర్‌ వద్ద పొట్ట, మెడ భాగాల్లో కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన యశోద భార్గవికి స్థానిక ఎన్టీఆర్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఆమెకు ప్రాణాపాయం లేదని వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన స్థానికులు నాగసాయికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం భార్గవి పరిస్థితి విషమంగా ఉంది.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu