Major Road Accident: తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం ఉదయం ఎదురెదురుగా వస్తున్న రెండ్లు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘోర ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. కొడంగల్ శివారులోని బండల ఎల్లమ్మ ఆలయం వద్ద ఘటన సంభవించింది. హైదరాబాద్ నుంచి కర్ణాటక వైపు వెళ్తున్న వాహనం.. ఎదురుగా వచ్చిన మరో కారు ఢీకొట్టుకున్నాయి. ఘటనలో ఇరు వాహనాల్లో ఉన్న ప్రయాణికులకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను కారులో నుంచి బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో రెండు కార్లు నుజ్జునుజ్జయ్యాయి. అయితే, మృతులకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు స్థానికుల నుంచి పలు వివరాలను సేకరించారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Also Read: