Telangana: రక్తసిక్తమైన వరంగల్ రోడ్లు.. వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు దుర్మరణం

వరంగల్(Warangala) లో ప్రధాన రహదారులు రక్తసిక్తమయ్యాయి. ఉదయం సమయంలో జరిగిన రెండు వెర్వేరు ఘోర రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృతి చెందారు. ఆటోను గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టిన ఘటనలో ముగ్గురు మృతి చెందగా...

Telangana: రక్తసిక్తమైన వరంగల్ రోడ్లు.. వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు దుర్మరణం
Follow us

|

Updated on: May 22, 2022 | 9:59 AM

వరంగల్(Warangala) లో ప్రధాన రహదారులు రక్తసిక్తమయ్యాయి. ఉదయం సమయంలో జరిగిన రెండు వెర్వేరు ఘోర రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృతి చెందారు. ఆటోను గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టిన ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. ఫ్లై ఓవర్ పై నుంచి కారు కిందపడిన ప్రమాదంలో దంపతులు మృత్యువాత పడ్డారు. నగరంలోని బొల్లికుంట(Bollikunta) లో ఉన్న వాగ్దేవి కాలేజ్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన స్థానికులు క్షతగాత్రుడిని బాధితుడిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులంతా వర్ధన్నపేటకు(Vardannapet) చెందిన కూరగాయల వ్యాపారులుగా పోలీసులు గుర్తించారు. మృతి చెందిన వారి వివరాలు, ఘటన జరిగిన తీరు వంటి అంశాలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరో ఘటనలో.. ఖమ్మం బైపాస్‌ హంటర్‌ రోడ్డులో ఫ్లై ఓవర్‌ నుంచి కారు కిందపడింది. ఈ ప్రమాదంలో దంపతులు దుర్మరణం పొందారు. ఘటన జరిగిన సమయంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా ఎంజీఎంలో చికిత్స పొందుతూ మరొకరు చనిపోయారు. మృతిచెందిన వారిని ప్రభుత్వ ఉద్యోగి సారయ్య(42), ఆయన భార్య సుజాత(39)గా గుర్తించారు. ప్రమాదంలో గాయపడిన మరొకరు ఎంజీఎంలో చికిత్స పొందుతున్నారు. అతడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి

ఇవీ చదవండి

Kakani Govardhan Reddy: కాకాణి అంటే మామూలుగా ఉండదు మరి.. అవాక్కైన కన్నడిగులు.. ఎందుకో తెలుసా!?

LPG Gas Cylinder: రూ.369కే ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్‌.. ఎలాంటి బుకింగ్‌, చిరునామా రుజువు అవసరం లేదు..!