వైద్యం చేస్తానంటూ యూట్యూబ్ యాడ్.. నమ్మి వచ్చిన వారికి షాక్

బెజవాడలో నాటువైద్యం పేరుతో దారుణం చోటుచేసుకుంది. బుద్ది మాంద్యానికి చికిత్స చేస్తామంటూ ఓ వ్యక్తి యూట్యూబ్‌లో ప్రకటనలు ఇచ్చారు. అయితే ఆ ప్రకటనలను చూసి వచ్చిన బాధితులు శోకసంద్రంలో మునిగిపోయారు. వివరాల్లోకి వెళితే.. భూమేశ్వరరావు అనే వ్యక్తి బుద్ది మాంద్యానికి నాటు వైద్యం చేస్తానంటూ యూట్యూబ్‌లో ప్రకటనలు ఇచ్చాడు. ఇది చూసిన కొందరు బాధితులు తమ పిల్లలతో బెజవాడకు వచ్చారు. గవర్నర్ పేటలోని గంగోత్రి లాడ్జిలో వైద్యం చేస్తానని చెప్పడంతో.. బెంగళూరు, బళ్లారి, తెలంగాణ, కడప ప్రాంతాలనుండి […]

వైద్యం చేస్తానంటూ యూట్యూబ్ యాడ్.. నమ్మి వచ్చిన వారికి షాక్
Follow us

| Edited By:

Updated on: Oct 15, 2019 | 7:59 PM

బెజవాడలో నాటువైద్యం పేరుతో దారుణం చోటుచేసుకుంది. బుద్ది మాంద్యానికి చికిత్స చేస్తామంటూ ఓ వ్యక్తి యూట్యూబ్‌లో ప్రకటనలు ఇచ్చారు. అయితే ఆ ప్రకటనలను చూసి వచ్చిన బాధితులు శోకసంద్రంలో మునిగిపోయారు. వివరాల్లోకి వెళితే.. భూమేశ్వరరావు అనే వ్యక్తి బుద్ది మాంద్యానికి నాటు వైద్యం చేస్తానంటూ యూట్యూబ్‌లో ప్రకటనలు ఇచ్చాడు. ఇది చూసిన కొందరు బాధితులు తమ పిల్లలతో బెజవాడకు వచ్చారు. గవర్నర్ పేటలోని గంగోత్రి లాడ్జిలో వైద్యం చేస్తానని చెప్పడంతో.. బెంగళూరు, బళ్లారి, తెలంగాణ, కడప ప్రాంతాలనుండి దాదాపు 11 మంది బాధితులు బెజవాడ చేరుకున్నారు. అయితే లాడ్జిలో మూడు గదులు తీసుకుని పదకొండు మంది పిల్లలకు నాలుగు రోజులుగా చికిత్సలు చేస్తున్నాడు నాటు వైద్యుడు. అయితే ఈ వైద్యం వికటించి కడప జిల్లాకు చెందిన హారానాద్ అనే బాలుడు మృతి చెందగా.. మరో ముగ్గురు పరిస్థితి విషమంగా మారింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మిగతా ముగ్గుర్ని విజయవాడ ఆంధ్ర ఆసుపత్రికి తరలించారు. నాటు వైద్యుడు భూమేశ్వరరావును అరెస్ట్ చేసినట్లు ఇన్స్పెక్టర్ పద్మిని తెలిపారు.