వామ్మో నైజిరియన్లు.. కరోనా కాలంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్‌తో…

ఓ వైపు దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తుంటే.. మరోవైపు డ్రగ్స్‌ సప్లయర్స్ మాత్రం వారి దందాలను జోరుగా సాగిస్తున్నారు. అది కూడా దేశరాజధాని ఢిల్లీలోనే. నైజీరియన్‌కి  చెందిన ఇద్దరు వ్యక్తుల బ్యాగులతో అనుమానాస్పదంగా సంచరిస్తుండటాన్ని గమనించిన పోలీసులు.. ప్రశ్నించేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులను చూసిన వెంటనే ఆ ఇద్దరు పారిపోతుండగా.. ఢిల్లీ పోలీసులు పట్టుకున్నారు. వారిద్దరినీ నైజీరియా దేశానికి చెందిన కింగ్‌స్లే ఇజూన్నా(28), ఫ్యాబ్రీస్ డల్లో(35)గా గుర్తించారు. వారి ద్ద బ్యాగులను తెరిచి చూడగా.. అందులో […]

వామ్మో నైజిరియన్లు.. కరోనా కాలంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్‌తో...
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 11, 2020 | 6:52 PM

ఓ వైపు దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తుంటే.. మరోవైపు డ్రగ్స్‌ సప్లయర్స్ మాత్రం వారి దందాలను జోరుగా సాగిస్తున్నారు. అది కూడా దేశరాజధాని ఢిల్లీలోనే. నైజీరియన్‌కి  చెందిన ఇద్దరు వ్యక్తుల బ్యాగులతో అనుమానాస్పదంగా సంచరిస్తుండటాన్ని గమనించిన పోలీసులు.. ప్రశ్నించేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులను చూసిన వెంటనే ఆ ఇద్దరు పారిపోతుండగా.. ఢిల్లీ పోలీసులు పట్టుకున్నారు. వారిద్దరినీ నైజీరియా దేశానికి చెందిన కింగ్‌స్లే ఇజూన్నా(28), ఫ్యాబ్రీస్ డల్లో(35)గా గుర్తించారు. వారి ద్ద బ్యాగులను తెరిచి చూడగా.. అందులో రూ.10 కోట్ల విలువగల డ్రగ్స్‌ను గుర్తించిన పోలీసులు.. వారిపై మాదకద్రవ్యాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. అనంతరం వారిద్దరినీ అరెస్ట్ చేశారు. కాగా.. ఓ వైపు కరోనా వ్యాప్తిచెందుతున్నా కూడా.. ఇదే సమయంలో వీరు డ్రగ్స్‌ను విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది.