Vijayawada Mystery: విజయవాడలో డెడ్‌బాడీ కలకలం.. లగ్జరీ కారు డోర్ తెరిచి చూసి..

Vijayawada Mystery: విజయవాడలో డెడ్‌బాడీ కలకలం.. లగ్జరీ కారు డోర్ తెరిచి చూసి..
Dead Body In A Ford Car Par

రాత్రి మిస్సింగ్‌ కేసు నమోదైంది.. ఉదయం కారులో డెడ్‌బాడీ కనిపించింది.. అయితే రాహుల్‌ ఎలా చనిపోయాడు ? ఎవరైనా హత్య చేశారా ? లేక ఆత్మహత్య చేసుకున్నాడా ? అసలు మాచవరం ఎందుకొచ్చాడు? ఇవన్నీ కూడా ఈ కేసులో అంతుచిక్కని ప్రశ్నలు...

Sanjay Kasula

|

Aug 19, 2021 | 2:21 PM

విజయవాడలో కారులో డెడ్‌బాడీ కలకలం రేపింది. మొగల్రాజపురం మానర్ ప్లాజా ఎదురుగా ఉన్న రోడ్డులో పార్క్ చేసిన ఫోర్డ్ కారులో డెడ్ బాడీ కనిపించింది. కారును ఓపెన్ చేశారు పోలీసులు.  అయితే.. కారులో డెడ్‌బాడీ ఘటనలో వ్యవహారంపై కొంత క్లారిటీ వచ్చింది. AP 16FF 9999 నెంబర్‌తో ఉన్న ఫోర్డ్‌ ఎండ్యూయర్‌ ఓనర్‌ రాహుల్‌ అని తేల్చారు. విజయవాడలో జిక్సిన్‌ సిలిండర్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీ ఓనర్‌గా చెబుతున్నారు. ప్రస్తుతం కారు పార్క్ చేసిన ఉన్న మాచవరంలోని కాలనీకి రాహుల్ ఫ్యామిలీ చేరుకున్నారు. అసలేం జరిగిందో వాళ్లకూ మిస్టరీగానే ఉంది.

కారులో డెడ్‌బాడీలు, శవాలు ఈ మధ్యకాలంలో తరచూ కనిపిస్తున్న ఘటనలు. మొన్నటికి మొన్న తెలంగాణలోని సంగారెడ్డిలోనూ ఇలాగే కారులో దగ్దమైన డెడ్‌బాడీ కలకలం రేపింది. అది మర్డర్‌గానే తేల్చారు. అంతలోనే ఇప్పుడు విజయవాడలో మరో సీన్‌.

మాచవరం పీఎస్ పరిధిలో రోడ్‌ పక్కగా పార్క్‌ చేసిన ఈ కాస్ట్‌లీ కారులో ఓ డెడ్‌బాడీ ఉంది. ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో చనిపోయి కనిపిస్తున్నాడు. కాస్ట్‌లీ కారు.. 9999 ఫ్యాన్సీ నెంబర్‌. విజయవాడ రిజిస్ట్రేషనే. కారులో పార్క్ చేసి ఉన్న ప్రాంతం ఓ కాలనీ.

కానీ ఆ కాలనీలో ఇళ్లకు, ఆ కారుకు ఎలాంటి సంబంధం లేదు. మరి ఈ కారు ఎక్కడి నుంచి వచ్చింది? అందులో ఉన్న రాహుల్‌ ఎలా అయితే ఎలా చనిపోయాడు. మాచవరం ఎందుకొచ్చాడు. ఎవరి ఇంటికి వచ్చాడు.

ఇవి కూడా చదవండి:  Success Story: మేడపై మల్లె పూల సాగు.. లక్షల్లో సంపాదన.. లాక్‌డౌన్ సమయంలో ఓ మహిళ విజయ గాథ..

Women Should be Careful: మీ పక్కనే మృగాళ్లుంటారు.. మహిళలు బీ కేర్ ఫుల్.. సో.. బీ అలర్ట్ లేడీస్..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu