బ్రేకింగ్: దిశ ఘటనపై అసభ్యకర పోస్ట్‌లు.. యువకుడి అరెస్ట్

తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం మొత్తాన్ని కలవరపాటుకు గురి చేసిన దిశ ఘటనపై అసభ్యకర పోస్ట్‌లు చేసిన యువకుడిని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని నిజామాబాద్ జిల్లాకు చెందిన శ్రీరామ్‌గా గుర్తించిన సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు.. అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఇతడిపై కేసును నమోదు చేసి సుమోటోగా స్వీకరించారు. కాగా దిశాపై హత్యాచారం జరిగిన నేపథ్యంలో.. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ దేశవ్యాప్తంగా ఆక్రోశం పెల్లుబికింది. అయితే ఓ గ్యాంగ్ మాత్రం ఫేస్‌బుక్‌లో గ్రూప్‌గా ఏర్పడి […]

బ్రేకింగ్: దిశ ఘటనపై అసభ్యకర పోస్ట్‌లు.. యువకుడి అరెస్ట్
Follow us

| Edited By:

Updated on: Dec 03, 2019 | 5:34 PM

తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం మొత్తాన్ని కలవరపాటుకు గురి చేసిన దిశ ఘటనపై అసభ్యకర పోస్ట్‌లు చేసిన యువకుడిని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని నిజామాబాద్ జిల్లాకు చెందిన శ్రీరామ్‌గా గుర్తించిన సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు.. అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఇతడిపై కేసును నమోదు చేసి సుమోటోగా స్వీకరించారు. కాగా దిశాపై హత్యాచారం జరిగిన నేపథ్యంలో.. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ దేశవ్యాప్తంగా ఆక్రోశం పెల్లుబికింది. అయితే ఓ గ్యాంగ్ మాత్రం ఫేస్‌బుక్‌లో గ్రూప్‌గా ఏర్పడి దిశాపై అసభ్యకర కామెంట్లు చేసింది. దిశాకు సంబంధించిన ఫొటోలను షేర్ చేసిన ఈ గ్యాంగ్.. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసింది. ఇక ఈ విషయం పోలీసుల వరకు వెళ్లడంతో.. దర్యాప్తు చేసిన పోలీసులు గ్యాంగ్ లీడర్ శ్రీరామ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతడిని దర్యాప్తు చేస్తున్నామని జాయింట్ కమిషనర్ పోలీస్ వెల్లడించారు.