కరోనా నిబంధనలు ఉల్లఘించిన యువకుడికి రూ.10 లక్షలు జ‌రిమాన

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి కట్టడికి ఆయా దేశ ప్రభుత్వాలు కఠినచర్యలు తీసుకుంటున్నాయి. తాజాగా కొవిడ్ నిబంధనలు ఉల్లఘించిన ఓ యువకుడికి దుబాయ్ ప్రభుత్వం భారీ జరిమాన విధించింది.

కరోనా నిబంధనలు ఉల్లఘించిన యువకుడికి రూ.10 లక్షలు జ‌రిమాన
Follow us

|

Updated on: Sep 13, 2020 | 3:32 PM

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి కట్టడికి ఆయా దేశ ప్రభుత్వాలు కఠినచర్యలు తీసుకుంటున్నాయి. తాజాగా కొవిడ్ నిబంధనలు ఉల్లఘించిన ఓ యువకుడికి దుబాయ్ ప్రభుత్వం భారీ జరిమాన విధించింది. క‌రోనా బారిన ప‌డ్డ ఓ ‌యువ‌కుడు హోం క్వారంటైన్ నిబంధ‌న‌లు ఉల్లంఘించినందుకు దుబాయ్ పోలీస్ అధికారులు అత‌నికి ఏకంగా రూ. 10 ల‌క్ష‌లు జ‌రిమాన విధించింది. ఈ విషయాన్ని డైరెక్ట‌ర్ ఆఫ్ క్రిమిన‌ల్ ఇన్విస్టిగేష‌న్ డిపార్ట్‌మెంట్‌ దుబాయ్ పోలీస్ బ్రిగేడియ‌ర్ జ‌మాల్ స‌లేం తెలిపారు.

దుబాయిలో ఓ యువకుడికి కొవిడ్ సోక‌డంతో హోం క్వారంటైన్ విధించారు ఆ దేశ ఆరోగ్య‌శాఖ అధికారులు. అయితే, అత‌ను క్వారంటైన్‌ను బేఖాత‌రు చేస్తూ బ‌య‌ట‌కు వ‌చ్చి కాఫీ షాపులో దర్శనమిచ్చాడు. అంతేకాదు అక్క‌డ కాఫీ తాగుతూ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. అనంత‌రం ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. వీడియో కాస్తా వైర‌ల్ మారడంతో విష‌యం అధికారుల దృష్టికి రావడంతో దర్యాప్తు చేపట్టారు. దీంతో వీడియోలోని దృశ్యాల ఆధారంగా స‌ద‌రు యువ‌కుడిని గుర్తించి చ‌ర్య‌లు తీసుకున్నారు. హోం క్వారంటైన్ నిబంధ‌న‌లు ఉల్లంఘించినందుకు 50వేల దిర్హామ్స్‌ అంటే సుమారు రూ.10ల‌క్ష‌లు జ‌రిమాన విధించామని అని దుబాయ్ పోలీస్ బ్రిగేడియ‌ర్ జ‌మాల్ స‌లేం తెలిపారు. కొవిడ్ పట్ల నిర్ల‌క్ష్యం ఎంతో ప్ర‌మాద‌కరమ‌ని, ఇలాంటివి మ‌రోసారి జ‌ర‌గ‌కుండా ఉండాలంటే భారీ జ‌రిమానాలు త‌ప్ప‌నిస‌రి అని జ‌మాల్ పేర్కొన్నారు.

24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్
మహేష్ బిజినెస్ కి జక్కన్న హెల్ప్ చేస్తున్నారా ??
మహేష్ బిజినెస్ కి జక్కన్న హెల్ప్ చేస్తున్నారా ??
ఉత్తర దక్షిణాలను కలుపుతున్న ఆధ్యాత్మిక అంశాలు
ఉత్తర దక్షిణాలను కలుపుతున్న ఆధ్యాత్మిక అంశాలు