చాదర్ ఘాట్‌లో దారుణం

హైదరాబాద్ లోని చాదర్‌ఘాట్‌లో దారుణం జరిగింది. పెళ్లి పేరుతో 24 సంవత్సరాల యువతిని అబ్దుల్ అజీజ్(65) అనే వృద్దుడు వేధించేవాడు. ఇద్దరి ఇళ్లు పక్క పక్కనే ఉండటంతో అజీజ్ సదరు యువతిని నిత్యం వేధింపులకు గురిచేసేవాడు. వేధింపులు తాళలేక విషయాన్ని బాలిక తన ఇంట్లో చెప్పింది. దీంతో బాలిక కుటుంబ సభ్యులు ఇదేంటని అబ్దుల్ అజీజ్‌ను నిలదీశారు. దీంతో ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. అబ్దుల్ అజీజ్ కుటుంబ సభ్యులు యువతి కుటుంబ సభ్యులపై కర్రలతో […]

  • Tv9 Telugu
  • Publish Date - 8:44 pm, Tue, 21 May 19
చాదర్ ఘాట్‌లో దారుణం

హైదరాబాద్ లోని చాదర్‌ఘాట్‌లో దారుణం జరిగింది. పెళ్లి పేరుతో 24 సంవత్సరాల యువతిని అబ్దుల్ అజీజ్(65) అనే వృద్దుడు వేధించేవాడు. ఇద్దరి ఇళ్లు పక్క పక్కనే ఉండటంతో అజీజ్ సదరు యువతిని నిత్యం వేధింపులకు గురిచేసేవాడు. వేధింపులు తాళలేక విషయాన్ని బాలిక తన ఇంట్లో చెప్పింది. దీంతో బాలిక కుటుంబ సభ్యులు ఇదేంటని అబ్దుల్ అజీజ్‌ను నిలదీశారు. దీంతో ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. అబ్దుల్ అజీజ్ కుటుంబ సభ్యులు యువతి కుటుంబ సభ్యులపై కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఓ యువకుడిపై రాయితో దాడి చేయడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. యువకుడు అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో స్థానిక ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. బాధిత యువతి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.