దొరికిపోయి.. చావుదెబ్బలు తిని..

రోజురోజుకు చైన్ స్నాచర్ల ఆగడాలు పెరిగిపోతున్నాయి. ఒంటరి మహిళలే టార్గెట్‌గా గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్నారు. మెడలోనుంచి గొలుసులను బలవంతంగా లాక్కెళ్లిపోతున్న సందర్భాల్లో బాధిత మహిళలు తీవ్రంగా గాయపడి ప్రాణాలు సైతం పోగొట్టుకోవాల్సి వస్తోంది. చెన్నైలో ఇలాంటి దొంగలకు బాగా బుద్ది చెప్పారు. జల్సాలకు మరిగి దొంగతనాలకు అలవాటు పడ్డ ఇద్దరు యువకులు అడ్డంగా దొరికిపోయి.. స్ధానికుల చేతిలో చావుదెబ్బలు తిన్నారు. చెన్నైలోని తండయార్‌పేటకు చెందిన ప్రశాంత్, మణికంఠన్ అనే యువకులు ఈజీ మనీకి అలవాటుపడి మహిళల మెడల్లోని […]

  • Tv9 Telugu
  • Publish Date - 1:54 pm, Sun, 14 July 19
దొరికిపోయి.. చావుదెబ్బలు తిని..

రోజురోజుకు చైన్ స్నాచర్ల ఆగడాలు పెరిగిపోతున్నాయి. ఒంటరి మహిళలే టార్గెట్‌గా గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్నారు. మెడలోనుంచి గొలుసులను బలవంతంగా లాక్కెళ్లిపోతున్న సందర్భాల్లో బాధిత మహిళలు తీవ్రంగా గాయపడి ప్రాణాలు సైతం పోగొట్టుకోవాల్సి వస్తోంది. చెన్నైలో ఇలాంటి దొంగలకు బాగా బుద్ది చెప్పారు. జల్సాలకు మరిగి దొంగతనాలకు అలవాటు పడ్డ ఇద్దరు యువకులు అడ్డంగా దొరికిపోయి.. స్ధానికుల చేతిలో చావుదెబ్బలు తిన్నారు.

చెన్నైలోని తండయార్‌పేటకు చెందిన ప్రశాంత్, మణికంఠన్ అనే యువకులు ఈజీ మనీకి అలవాటుపడి మహిళల మెడల్లోని గెలుసులు తెంచడమే పనిగా పెట్టుకున్నారు. స్ధానికంగా రమణానగర్ ప్రాంతంలో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న మహిళపై కన్నేసిన వీరిద్దరూ బైక్ మీద వెనకనుంచి వచ్చి ఆమె మెడలోని చైన్ లాగేందుకు ప్రయత్నించారు. అయితే వెంటనే మహిళ వారితో పెనుగులాడింది. దీంతో వారిద్దరూ బైక్ నుంచి కిందపడిపోయారు. ఆ మహిళ గట్టిగా కేకలు వేయడంతో స్ధానికులు వచ్చి ఇద్దరినీ చితకబాది పోలీసులకు అప్పగించారు.