హైదరాబాద్ : అంబర్‌పేటలో ఎస్సై ఆత్మహత్య

పోలీసులకు పని ఒత్తిడి ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకవైపు ఉన్నతాధికారుల ఆర్డర్స్, మరోవైపు నుంచి రాజకీయ నాయకుల నుంచి ఒత్తిళ్లు..ఇలా వారు విధుల్లో తీవ్ర మానసిక ఒత్తిళ్లకు లోనవుతూ ఉంటారు. వారాంతపు సెలవులు కూడా అంతంత మాత్రమే. కుటుంబంతో సమయం గడపడానికి అస్సలు వీలు కుదరదు. ఇలా అనేక కారణాలతో వారు తీవ్ర సంఘర్షణకు లోనవుతూ ఉంటారు. తాజాగా  సీసీఎస్ ఎస్‌ఐ సైదులు అంబర్‌పేటలోని తన ఇంట్లో ఆత్మహత్యకు చేసుకున్నాడు.  భార్య, పిల్లలను […]

హైదరాబాద్ : అంబర్‌పేటలో ఎస్సై ఆత్మహత్య
Follow us

|

Updated on: Dec 23, 2019 | 12:39 PM

పోలీసులకు పని ఒత్తిడి ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకవైపు ఉన్నతాధికారుల ఆర్డర్స్, మరోవైపు నుంచి రాజకీయ నాయకుల నుంచి ఒత్తిళ్లు..ఇలా వారు విధుల్లో తీవ్ర మానసిక ఒత్తిళ్లకు లోనవుతూ ఉంటారు. వారాంతపు సెలవులు కూడా అంతంత మాత్రమే. కుటుంబంతో సమయం గడపడానికి అస్సలు వీలు కుదరదు. ఇలా అనేక కారణాలతో వారు తీవ్ర సంఘర్షణకు లోనవుతూ ఉంటారు.

తాజాగా  సీసీఎస్ ఎస్‌ఐ సైదులు అంబర్‌పేటలోని తన ఇంట్లో ఆత్మహత్యకు చేసుకున్నాడు.  భార్య, పిల్లలను స్కూళ్లో దింపేందుకు వెళ్లిన సమయంలో సైదులు ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. అయితే పై అధికారుల వేధింపులే సూసైడ్‌కి కారణమని భార్య నీలిమ ఆరోపిస్తున్నారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సైదులు మెడికల్ బిల్లులకు దరఖాస్తు చేసుకోగా, పై అధికారులు వాటిని తిరస్కరించారని తెలిపారు. గతంలో మొబైల్ కోర్టులో పనిచేసిన సమయంలో కూడా సైదులు నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించినట్టు సమాచారం.