దిశ కేసు నిందితుడి తండ్రికి ప్రమాదం.. పరిస్థితి విషమం

తెలంగాణలోని నారాయణ్ పేట్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. మక్తల్ మండలం జక్లేర్ గ్రామంలో దిశ కేసు నిందితుడు చెన్నకేశవులు తండ్రి కుర్మయ్య ప్రయాణిస్తోన్న బైక్‌ను ఇన్నోవా కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కుర్మయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. ఆయనకు పరిస్థితి విషమంగా ఉండడంతో.. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొన్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే గత నెల 27న శంషాబాద్ సమీపంలోని తొండుపల్లి టోల్‌ ప్లాజా వద్ద ఓ […]

దిశ కేసు నిందితుడి తండ్రికి ప్రమాదం.. పరిస్థితి విషమం
TV9 Telugu Digital Desk

| Edited By:

Dec 27, 2019 | 9:15 AM

తెలంగాణలోని నారాయణ్ పేట్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. మక్తల్ మండలం జక్లేర్ గ్రామంలో దిశ కేసు నిందితుడు చెన్నకేశవులు తండ్రి కుర్మయ్య ప్రయాణిస్తోన్న బైక్‌ను ఇన్నోవా కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కుర్మయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. ఆయనకు పరిస్థితి విషమంగా ఉండడంతో.. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొన్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే గత నెల 27న శంషాబాద్ సమీపంలోని తొండుపల్లి టోల్‌ ప్లాజా వద్ద ఓ పశు వైద్యురాలు దారుణ హత్యాచారానికి గురైంది. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపగా.. ఇందులో నారాయణ పేట్ జిల్లా మక్తల్ మండలానికి చెందిన అరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులును ప్రధాన నిందితులుగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక డిసెంబరు 6న జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఈ నలుగురు నిందితులు చనిపోయారు. అయితే ఈ ఎన్‌కౌంటర్‌పై కేసు నమోదు కావడంతో నిందితుల అంత్యక్రియల ప్రక్రియ ఆలస్యమైంది. ఎన్‌కౌంటర్ జరిగిన 17 రోజులు తర్వాత నిందితుల అంత్యక్రియలు డిసెంబర్ 23న ముగిసిన విషయం తెలిసిందే.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu