ఆత్మహత్య చేసుకుంటున్నా,నన్ను వేధిస్తున్నారు, బీజేపీ ఎంపీ కౌశల్ కిషోర్ కోడలి హెచ్చరిక,

బీజేపీ ఎంపీ కౌశల్ కిషోర్  కోడలు అంకిత ఆత్మహత్యాయత్నం చేసింది. తన మణికట్టును కోసుకుని తీవ్రంగా గాయపడడంతో ఆమెను హుటాహుటిన లక్నోలోని ఆసుపత్రికి తరలించారు.

  • Umakanth Rao
  • Publish Date - 3:52 pm, Mon, 15 March 21
ఆత్మహత్య చేసుకుంటున్నా,నన్ను వేధిస్తున్నారు,  బీజేపీ ఎంపీ కౌశల్ కిషోర్ కోడలి హెచ్చరిక,
Ankita

బీజేపీ ఎంపీ కౌశల్ కిషోర్  కోడలు అంకిత ఆత్మహత్యాయత్నం చేసింది. తన మణికట్టును కోసుకుని తీవ్రంగా గాయపడడంతో ఆమెను హుటాహుటిన లక్నోలోని ఆసుపత్రికి తరలించారు. ఈనెల 14-15 తేదీల మధ్య ఆమె ఇందుకు యత్నించింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు డాక్టర్లు తెలిపారు. తన మణికట్టును కోసుకునే ముందు అంకిత.. రెండు వీడియోలను సోషల్  మీడియాలో పోస్ట్ చేసింది. తన జీవితాన్ని ముగిస్తున్నానని వీటిలో ఆమె పేర్కొంది. తన భర్త ఆయుష్, మామ కౌశల్ కిషోర్, ఎమ్మెల్యే అయిన అత్త జయదేవి, ఆయుష్ సోదరుడు కూడా తనను వేధిస్తున్నారని, తన బలవన్మరణానికి వీరే కారకులని అంకిత తెలిపింది. ఆయుష్ తనకు ద్రోహం చేశాడని అంటూ ఆమె విలపించింది. తనను చూసేందుకు ఆయుష్ వస్తాడని ఆశించానని, కానీ రాలేదని ఆమె వాపోయింది. ఈమె ఆదివారం రాత్రి కౌశల్ కిషోర్ ఇంటికి వెళ్లిందని, అక్కడ సూసైడ్ అటెంప్ట్ చేసిందని తెలుస్తోంది.

అంకితతో ఆయుష్ పెళ్లి గత ఏడాది జరిగింది. వీరిది ప్రేమ పెళ్లి..తన తలిదండ్రులని కాదని ఆయుష్ ఈమెను పెళ్లి చేసుకున్నాడని, అప్పటి నుంచీ అతడు తన పేరెంట్స్ కి దూరంగా ఉంటున్నాడని ఆ మధ్య వార్తలు వచ్చాయి. తనపై తనను కాల్పులు జరుపుకున్నందుకు ఇతనిపై పోలీసులు కేసు కూడా పెట్టారు.(ఇతనిదంతా డ్రామా అని వారు పేర్కొన్నారు కూడా).  తన భార్యకు  ఇదివరకే పెళ్లయిందని, ఆమె తనను టార్చర్ పెడుతుందని ఆయుష్ ఇటీవల ఆరోపించాడు.

కాగా ఇప్పుడు ఇతని భార్య అంకితే ఇతనిపై ఆరోపణలు చేస్తోంది. తనకు ద్రోహం చేసినందుకు ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ మణికట్టును కోసుకుంది. పైగా ఆయుష్ తలిదండ్రులపై కూడా ఆమె ఆరోపణలు చేయడం గమనార్హం.  ఈ కేసును పోలీసులు గానీ, కోర్టు గానీ ఎలా పరిష్కరిస్తాయో చూడాలి .

 

మరిన్ని ఇక్కడ చూడండి: Kadapa District: దుబాయ్ నుంచి తిరిగొచ్చిన భర్త.. షాక్ ఇచ్చిన భార్య.. చివరికి కన్నతండ్రే ఆమెను..

Jr NTR : ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి మరో హీరో.. బాధ్యతలు తీసుకుంటున్న తారక్.. త్వరలోనే..