అర్ధరాత్రి బంజారాహిల్స్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి తీవ్ర గాయాలు.. బెంజ్ కారుతో వీరంగం సృష్టించిన మందుబాబులు

కొంతమంది ఆకతాయిలు పీకల దాకా మందు తాగి.. వాహనాలతో రోడ్డు పైకి వచ్చ అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.

  • uppula Raju
  • Publish Date - 10:53 am, Sun, 22 November 20
అర్ధరాత్రి బంజారాహిల్స్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి తీవ్ర గాయాలు.. బెంజ్ కారుతో వీరంగం సృష్టించిన మందుబాబులు

కొంతమంది ఆకతాయిలు పీకల దాకా మందు తాగి.. వాహనాలతో రోడ్డు పైకి వచ్చ అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. శనివారం అర్దరాత్రి పబ్‌లో పుల్‌గా మందుకొట్టిన మందుబాబులు.. బెంజ్ కారు ఎక్కి అతి వేగంగా రోడ్డుపైకి దూసుకొచ్చి ఘోర రోడ్డు ప్రమాదానికి కారణమయ్యారు.. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3. లో అర్ధరాత్రి అలజడి సృష్టించారు. కారును అతి వేగంగా నడుపుతూ ఎదురుగా వచ్చిన ఇండికా కారును బలంగా ఢీ కొట్టారు. దీంతో కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బెంజ్ కారులో ముగ్గురు యువకులు, ఒక యువతి ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. కారు నడిపిన హార్దిక్ రెడ్డి, అఖిల్, ప్రమోద్‌లను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

ఇదిలా ఉంటే బంజారా హిల్స్ రోడ్డు నెంబర్ 3 దగ్గర ఉన్న రాయల్ టిఫిన్ సెంటర్ డేంజర్ స్పాట్‌గా మారింది. ఇక్కడ తరచూ యాక్సిడెంట్లు జరిగి ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. వెంటనే అక్కడ స్పీడ్ బ్రేకర్ల లాంటివి ఏర్పాటు చేస్తే బాగుంటుందని నగరవాసులు కోరుకుంటున్నారు. పోలీసులు కూడా ఇక్కడ ఏవైనా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని వేడుకుంటున్నారు.