బెంగళూరు ఘర్షణ కేసులో కాంగ్రెస్ కార్పోరేటర్‌ భర్త అరెస్ట్

బెంగళూరులో మంగళవారం రాత్రి చోటుచేసుకున్న ఘర్షణల గురించి తెలిసిందే. సోషల్ మీడియాలో కాంగ్రెస్ ఎమ్మెల్యే మేనళ్లుడు చేసిన ఓ పోస్ట్ పెనుదుమారం రేపింది. ఓ వర్గానికి చెందిన వారు కాంగ్రెస్ ఎమ్మెల్యే..

బెంగళూరు ఘర్షణ కేసులో కాంగ్రెస్ కార్పోరేటర్‌ భర్త అరెస్ట్
Follow us

| Edited By:

Updated on: Aug 14, 2020 | 7:05 PM

బెంగళూరులో మంగళవారం రాత్రి చోటుచేసుకున్న ఘర్షణల గురించి తెలిసిందే. సోషల్ మీడియాలో కాంగ్రెస్ ఎమ్మెల్యే మేనళ్లుడు చేసిన ఓ పోస్ట్ పెనుదుమారం రేపింది. ఓ వర్గానికి చెందిన వారు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంటిపై దాడి చేయడంతో పాటుగా.. అనేక వాహనాలను ధ్వంసం చేస్తూ.. పోలీస్ స్టేషన్‌పై కూడా దాడికి దిగారు. అడ్డుకునేందుకు యత్నించిన పోలీసులపై రాళ్ల వర్షం కురిపించారు. ఈ ఘటనలో దాదాపు అరవై మంది పోలీసులు గాయపడ్డారు. ఈ క్రమంలో పరిస్థితి అదుపుతప్పుతుండటంతో.. పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. అయితే ఈ ఘటన పక్కా స్కెచ్‌తో జరిగిందని రాష్ట్రానికి చెందిన పలువురు మంత్రులు అభిప్రాయపడ్డారు.

ఇదిలావుంటే.. ఈ ఘటనకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ కార్పోరేటర్‌ భర్తను పోలీసులు అరెస్ట చేశారు. బృహన్ బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్ (బీబీఎంపీ) నాగ్వారా వార్డు కార్పొరేటర్ ఇర్షాద్ బేగం భర్త అయిన కలీంపాషాను పోలీసులు అరెస్టు చేశారు. ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా తేలింది. కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత కేజే జార్జ్‌కు అత్యంత సన్నిహితుడన్న వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు.. ఆయన గతంలో మాజీ సీఎం సిద్దరామయ్యతో కలిసిన ఓ ఫోటో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఇక ఈ కేసులో ఇప్పటి వరకు 60 మందిని అరెస్టు చేశామని.. 206 మందిని అదుపులోకి తీసుకున్నామని బెంగళూరు జాయింట్ పోలీసు కమిషనర్ సందీప్ పాటిల్ తెలిపారు.

Read More :

దంతేవాడలో పెద్ద ఎత్తున లొంగిపోయిన మావోలు

మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం