ఆహారం, నీళ్లు మరిచి పబ్‌జీ.. చివరకు పోయిన ప్రాణాలు

ఆహారం, నీళ్లు మరిచి పబ్‌జీ.. చివరకు పోయిన ప్రాణాలు

పబ్‌జీ ఆట మరో టీనేజర్ ప్రాణాలను పొట్టనపెట్టుకుంది. ఈ ఆటకు బానిసైన ఓ యువకుడు ఆహారం, నీళ్లు మరిచి రోజుల తరుబడి దాన్ని ఆడుతూనే ఉన్నాడు.

TV9 Telugu Digital Desk

| Edited By:

Aug 13, 2020 | 7:04 PM

PUBG kills teenager: పబ్‌జీ ఆట మరో టీనేజర్ ప్రాణాలను పొట్టనపెట్టుకుంది. ఈ ఆటకు బానిసైన ఓ యువకుడు ఆహారం, నీళ్లు మరిచి రోజుల తరుబడి దాన్ని ఆడుతూనే ఉన్నాడు. ఆ క్రమంలో అతడి ప్రాణాలు పోయాయి. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళితే.. కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో ఇంట్లోనే ఉన్న ఓ యువకుడు ఆన్‌లైన్‌లో‌ ఆటలను ఆడేవాడు. ముఖ్యంగా పబ్‌జీకి ఆ టీనేజర్ బానియ్యాడు. దీంతో ఆహారం, నీళ్లు మరిచాడు. సమయానికి తిండి లేకపోవడం, నీళ్లు తాగకపోవడంతో ఇటీవల డీహైడ్రేషన్‌కి గురయ్యాడు. దీంతో అతడి కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అతడికి డయేరియా వచ్చినట్లు నిర్ధారణ కావడంతో., వైద్యులు చికిత్సను అందించారు. ఈ క్రమంలో ఆ యువకుడు సోమవారం కన్నుమూశాడు. కాగా ఇలాంటి కేసునే పుణేలో జరిగింది. పబ్‌జీకి బానిసైన ఓ 25ఏళ్ల వ్యక్తి బ్రైయిన్ స్ట్రోక్ అయ్యి మరణించాడు. కాగా ఉత్తరకొరియాకు చెందిన ఈ ఆట‌ ఇప్పటికే పలువురి ప్రాణాలను పొట్టనపెట్టుకున్న విషయం తెలిసిందే.

Read More:

‘ప్లాస్మా దానం’పై ఎలాంటి అపోహలు వద్దు: ఆళ్ల నాని

‘బొజ్జ’నే అతడి ప్రాణాలనే కాపాడింది

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu