వాళ్లను కూడా కాల్చేయండి.. చెన్నకేశవులు భార్య ధర్నా

అమ్మాయిపై అత్యాచారం చేసినందుకు ఈ నలుగురినే కాదని, ఇలాంటి కేసుల్లో నిందితులుగా జైళ్లలో ఉన్న వారిని కూడా చంపేయాలని దిశ కేసు నిందితుల్లో ఒకరైన చెన్నకేశవులు భార్య ధర్నా చేస్తోంది. ఈ ఎన్‌కౌంటర్ జరిగినందుకు ప్రజలంతా ఖుషీలో ఉన్నారని, కానీ గతంలో ఇలాంటి సంఘటనలు చేసిన నిందితులను కూడా ఇలానే కాల్చేయండి అంటూ ఆమె డిమాండ్ చేస్తోంది. అయితే ఈ ఎన్‌కౌంటర్‌పై ఈ ఉదయం మాట్లాడిన ఆమె.. తన భర్తను ఎన్‌కౌంటర్ చేసిన చోటే తనను చంపేయండి […]

  • Tv9 Telugu
  • Publish Date - 6:38 pm, Fri, 6 December 19
వాళ్లను కూడా కాల్చేయండి.. చెన్నకేశవులు భార్య ధర్నా

అమ్మాయిపై అత్యాచారం చేసినందుకు ఈ నలుగురినే కాదని, ఇలాంటి కేసుల్లో నిందితులుగా జైళ్లలో ఉన్న వారిని కూడా చంపేయాలని దిశ కేసు నిందితుల్లో ఒకరైన చెన్నకేశవులు భార్య ధర్నా చేస్తోంది. ఈ ఎన్‌కౌంటర్ జరిగినందుకు ప్రజలంతా ఖుషీలో ఉన్నారని, కానీ గతంలో ఇలాంటి సంఘటనలు చేసిన నిందితులను కూడా ఇలానే కాల్చేయండి అంటూ ఆమె డిమాండ్ చేస్తోంది.

అయితే ఈ ఎన్‌కౌంటర్‌పై ఈ ఉదయం మాట్లాడిన ఆమె.. తన భర్తను ఎన్‌కౌంటర్ చేసిన చోటే తనను చంపేయండి అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్తను అన్యాయంగా పోలీసులు చంపేశారని చెన్నకేశవులు భార్య చెబుతోంది. ఒక అమ్మాయి కోసం నలుగురిని పొట్టన పెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. దిశ చెల్లెలికి బదులు పోలీసులకు ఫోన్ చేస్తే ఈ ఘోరం జరిగేది కాదని ఆమె పేర్కొంది. ఈ కేసులో కోర్టు తీర్పు ఇవ్వకముందే పోలీసులు ఇలా చేయడం తప్పని అన్న ఆమె.. తనను కూడా అదే ప్రదేశంలో చంపేయండి అని తన బాధను వ్యక్తపరిచింది. ఇదిలా ఉంటే దిశ కేసులో నిందితులు నలుగురిని ఎన్‌కౌంటర్ చేసిన తెలంగాణ పోలీసులు, వారి మృతదేహాలకు శవపరీక్షలు నిర్వహించారు. మరోవైపు ఆ నలుగురికి అంత్యక్రియలకు చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.

కాగా దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ హత్యాచారం కేసులో పోలీసులు నిందితులను ఎన్‌కౌంటర్ చేశారు. నిందితులను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుంచి కీలక ఆధారాలు సేకరించే క్రమంలో సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేస్తుండగా.. వారు తప్పించుకునేందుకు యత్నించారు. ఆ తరువాత పోలీసులపై నిందితులు.. రాళ్లు, కర్రలతో దాడి చేశారు. ఏ1 నిందితుడు ఆరిఫ్ పోలీసుల వద్ద నుంచి ఆయుధాలు లాక్కొని కాల్పులు జరిపాడు. ఈ నేపథ్యంలో పోలీసులు హెచ్చరించినా నిందితులు వినలేదు. ఈ క్రమంలోనే వారిని పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. ఉదయం గం.5.30 నుంచి గం.6.15ని.ల మధ్యలో ఈ ఎన్‌కౌంటర్ జరిగినట్లు సీపీ సజ్జనార్ ప్రకటించారు.