Crime: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి.. భర్తను విచారిస్తుండగా బయటపడ్డ సంచలన నిజం.

సమాజంలో రోజు రోజుకీ విలువలు తగ్గిపోతున్నాయడానికి జరుగుతోన్న సంఘటనలే సాక్ష్యంగా నిలుస్తున్నాయి. డబ్బు కోసం కొందరు ఎంతటి దారుణానికైనా దిగజారుతున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ దారుణం అందరినీ షాకింగ్ గురి చేసింది. వివరాల్లోకి వెళితే..

Crime: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి.. భర్తను విచారిస్తుండగా బయటపడ్డ సంచలన నిజం.
Crime News
Follow us

|

Updated on: Dec 01, 2022 | 8:42 AM

సమాజంలో రోజు రోజుకీ విలువలు తగ్గిపోతున్నాయడానికి జరుగుతోన్న  నేరాలు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. డబ్బు కోసం కొందరు ఎంతటి దారుణానికైనా దిగజారుతున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ దారుణం అందరినీ షాకింగ్ గురి చేసింది. వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌లోని జైపూర్కు చెందిన షాలూ, మహేశ్‌ చంద్‌ భార్య భర్తలు. వీరికి ఓ కూతురు ఉంది. ఇద్దరి మధ్య బేదాభిప్రాయాలు రావడంతో షాలూ కొన్ని రోజులుగా పుట్టింట్లో ఉంటోంది. అయితే తమ మధ్య ఉన్న గొడవలు తొలగిపోవాలంటే 11 వారాల పాటు పూజా చేయాలని ఓ జ్యోతిష్యుడు చెప్పాడని భార్యను నమ్మించాడు మహేశ్‌.

ఇందులో భాగంగానే తెల్లవారు జామున హనుమాన్‌ ఆలయానికి వెళ్లాలని చెప్పాడు. దీంతో భర్త మాటలు నమ్మిన షాలూ.. వెళ్లడం ప్రారంభించింది. ఈ క్రమంలోనే ఓరోజు ఉదయం సోదరుడితో ఆలయానికి వెళ్తోన్న సమయంలో షాలూను ఓ బైక్‌ ఢీకొట్టింది. దీంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. తీవ్ర గాయాలైన సోదరుడు చికిత్స పొందుతున్నాడు. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. మొదట ఇది ప్రమాదమేనని భావించిన పోలీసులకు ఇన్వెస్టిగేషన్‌లో షాకింగ్ విషయాలు తెలిశాయి.

అసలు ఏం జరిగిందంటే..

షాలూను భర్త మహేశ్‌ చంద్‌ హత్య చేయించినట్లు పోలీసుల విచారణలో తేలింది. పోలీసులు తమదైన స్టైల్‌లో అడగడంతో ఇన్సూరెన్స్‌ డబ్బుల కోసమే ఇలా చేశానని ఒప్పుకున్నాడు. ముందస్తు ప్లాన్‌ ప్రకారం షాలూకు ఇన్సూరెన్స్‌ చేయించాడు మహేశ్‌. సాధారణ మరణమైతే రూ.కోటి, యాక్సిడెంట్‌లో చనిపోతే రూ.1.90 కోట్లకు 40 ఏండ్ల కాలానికి పాలసీ తీసుకున్నాడు. అనుకున్నట్లుగానే రౌడీ షీటర్‌ ముఖేశ్‌ సింగ్‌తో కలిసి ఆమె హత్యకు ప్లాన్‌ చేశాడు. భార్యను చంపి ఇన్సూరెన్స్‌ మొత్తాన్ని కొట్టేయాలని కన్నింగ్ ప్లాన్‌ చేశాడు. కానీ కథ అడ్డం తిరగడంతో ఇప్పుడు ఊసలు లెక్కిస్తున్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?