Madhya Pradesh Accident: మధ్యప్రదేశ్‌ బస్సు ప్రమాదం.. 47కి చేరిన మృతుల సంఖ్య.. కొనసాగుతున్న రెస్క్యూ..

Madhya Pradesh Bus Accident: మధ్యప్రదేశ్‌లోని సిద్ధి జిల్లాలో మంగళవారం ఘోర బస్సు ప్రమాదంలో ఇప్పటివరకు 47 మంది మృతి చెందారు. దాదాపు 60 మందిపైగా ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేటు బస్సు..

Madhya Pradesh Accident: మధ్యప్రదేశ్‌ బస్సు ప్రమాదం.. 47కి చేరిన మృతుల సంఖ్య.. కొనసాగుతున్న రెస్క్యూ..
Follow us

|

Updated on: Feb 17, 2021 | 5:39 AM

Madhya Pradesh Bus Accident: మధ్యప్రదేశ్‌లోని సిద్ధి జిల్లాలో మంగళవారం ఘోర బస్సు ప్రమాదంలో ఇప్పటివరకు 47 మంది మృతి చెందారు. దాదాపు 60 మంది ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేటు బస్సు అదుపు తప్పి సిధి జిల్లా పట్నా సమీపంలోని బ్రిడ్జిపై నుంచి శారద కెనాల్‌లో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలతో బయటపడగా.. అందరూ నీటిలో గల్లంతయ్యారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య ఇంకా పెరగుతూనే ఉంది. మృతుల్లో 25 మంది పురుషులు, 20 మంది మహిళలు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఏఎన్‌ఎం పరీక్ష రాయడానికి ఈ బస్సులో వెళ్తున్న 30 నుంచి 35 మంది అభ్యర్థుల్లో దాదాపు అందరూ మృతిచెందినట్లు పేర్కొంటున్నారు. సిధి నుంచి సాత్నాకు వెళ్తున్న క్రమంలో పట్నా గ్రామ సమీపంలో మంగళవారం ఉదయం ఈ దుర్ఘటన జరిగింది. బస్సులో 55 మందికిపైగా ప్రయాణికులు ఉన్నట్టు అధికారులు పేర్కొంటున్నారు. గల్లంతైన మరికొంతమంది కోసం ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయని అధికారులు వెల్లడించారు.

ఇదిలాఉంటే.. ఈ ఘోర బస్సు ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు రెండు లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు. కాగా మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా మృతుల కుటుంబాలకు రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు.

Also Read:

Gujarat: రాజులా ప్రాంతంలో సింహాన్ని ఢికొన్న గూడ్స్ రైలు.. తీవ్ర గాయాలు.. దర్యాప్తు చేస్తున్న అధికారులు

India – China Disengagement: సరిహద్దుల్లో దళాల ఉపసంహరణ వేగవంతం.. ఫొటోలను విడుదల చేసిన భారత ఆర్మీ