Rishikesh: పునరావాస కేంద్రంలో దారుణం.. యువతిపై సామూహిక అత్యాచారం.. నిందితుల అరెస్టు

Rishikesh: దేశంలో దారుణాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. చిన్నారులపై, మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా..

Rishikesh: పునరావాస కేంద్రంలో దారుణం.. యువతిపై సామూహిక అత్యాచారం.. నిందితుల అరెస్టు
Subhash Goud

|

Aug 01, 2022 | 8:54 PM

Rishikesh: దేశంలో దారుణాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. చిన్నారులపై, మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా.. కామాంధుల ఆగడాలు ఏ మాత్రం ఆగడం లేదు. ఉత్తరాఖండ్‌లోని రిషికేష్‌లో ఓ డ్రగ్ అడిక్షన్ రిహాబిలిటేషన్ సెంటర్‌లో ఢిల్లీకి చెందిన ఓ మహిళ నడుపుతున్న సెంటర్‌లో దారుణం చోటు చేసుకుంది. 25 ఏళ్ల యువతిపై అత్యాచారం జరిగింది. ఈ మేరకు తనపై అత్యాచారం జరిగినట్లు సదరు యువతి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని పునరావాస కేంద్రానికి వెళ్లారు. కొత్వాలి స్టేషన్‌ ఆఫీసర్‌ రవి సైనీ తెలిపిన వివరాల ప్రకారం.. రిషికేష్‌లో పునరావాస కేంద్రాన్ని నిర్వహిస్తున్న ఢిల్లీకి చెందిన ఓ యువతి ద్వారా బాధితురాలికి సదరు వ్యక్తితో పరిచయం ఏర్పడింది.

కొన్ని రోజుల తర్వాత ఆమెకు ఆ వ్యక్తి కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేశారు. ఆమె సృహలోంచి తేరుకున్న తర్వాత అసభ్యకరమైన వీడియోలు, ఫోటోలతో ఆమెను బెదిరించారు. అంతేకాకుండా సదరు నిందితులు బాలికను బ్లాక్‌ మెయిల్‌ చేస్తూ నగరం బయటకు తీసుకెళ్లి పలు మార్లు అత్యాచారానికి పాల్పడినట్లు తెలిపారు. ఇక తనపై జరుగుతున్న అత్యాచారాన్ని భరించలేక పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితున్ని అరెస్టు చేయాలని కోరింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పునరావాస కేంద్రాన్ని మూసివేశారు. నిందితులిద్దరు పరారీలో ఉండగా, ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగి వారిని అరెస్టు చేశారు. నిందితులపై సెక్షన్‌ 376 (అత్యాచారం శిక్ష), సెక్షన్‌ 328 (మత్తుమందు ఉపయోగించి అత్యాచారానికి పాల్పడటం) సెక్షన్‌ 506 బెదిరింపులకు పాల్పడటం) 120B నేరపూరిత కుట్రకు శిక్ష) కింద కేసు నమోదు చేశారు పోలీసులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu