మావోయిస్టులకు ట్రాక్టర్లు సప్లే చేస్తున్న ఇద్దరి అరెస్ట్.. బీజేపీ నేత సహా..

ఛత్తీస్‌గఢ్‌ బస్తర్ జిల్లాలోని మావోయిస్టులకు ట్రాక్టర్లు, వస్తువులను సప్లే చేస్తున్న ఇద్దరు వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో ఓ బీజేపీ నేత కూడా ఉన్నట్లు ఛత్తీస్‌గఢ్ పోలీసులు వెల్లడించారు.

  • Tv9 Telugu
  • Publish Date - 8:03 pm, Sun, 14 June 20
మావోయిస్టులకు ట్రాక్టర్లు సప్లే చేస్తున్న ఇద్దరి అరెస్ట్.. బీజేపీ నేత సహా..

ఛత్తీస్‌గఢ్‌ బస్తర్ జిల్లాలోని మావోయిస్టులకు ట్రాక్టర్లు, వస్తువులను సప్లే చేస్తున్న ఇద్దరు వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో ఓ బీజేపీ నేత కూడా ఉన్నట్లు ఛత్తీస్‌గఢ్ పోలీసులు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దంతేవాడ జిల్లా పరిసర ప్రాంతాల్లో మావోయిస్టులకు ట్రాక్టర్లు, వస్తువులు అందజేస్తున్న వారిపై దృష్టిసారించామని తెలిపారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి మావోయిస్టులకు ట్రాక్టర్లు, వస్తువులు సప్లే చేస్తున్నారని పక్కా సమాచారం అందిందని.. అందులో దంతేవాడకు చెందిన ఓ బీజేపీ నేత ఉన్నారని గుర్తించామన్నారు. అతని ద్వారా  ట్రాక్టర్లతో పాటు.. మరికొన్ని వస్తువులు కొని.. వాటిని ఓ వ్యక్తి మావోయిస్టులకు అందజేస్తున్నట్లు ఆధారాలు లభించాయని.. దీంతో బీజేపీ నేతతో పాటు మరో వ్యక్తిని కూడా అరెస్ట్ చేశామని.. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నామన్నారు.