Breaking News
  • కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు అనేక మంది ప్రముఖులు తమ మద్దతు తెలిపారు. ప్రభుత్వ ప్రయత్నాలకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు బుధవారం భారీ ఎత్తున విరాళాలు అందించారు.
  • భక్తులు లేక భద్రాద్రి బోసిపోయింది.. సీతా రామ చంద్ర స్వామి వారి కల్యాణానికి కరోనా ఆటంకం ఏర్పడింది .. కరోనా వైరస్ విస్తరణకు సామాజిక దూరం పాటించడమే శరణ్యం కావడంతో ... నిరాడంబరంగా జగదబిరాముని కళ్యాణం జరిగితోంది.
  • జమ్మూకాశ్మీర్ లోని కొన్ని గ్రామాలు రెడ్ జోన్ గా ప్రకటన. రాజౌరి జిల్లాలోని మంజకోట్ తహసీల్‌కు చెందిన సరోలా, డెహ్రీధర, మంగల్ నార్, గంబిర్ ముగ్లాన్ & కోట్లి అనే 5 గ్రామాలు జమ్మూ లో రెడ్ జోన్‌లుగా ప్రకటించిన అధికారులు.
  • కోవిడ్‌పై పోరు కోసం కిషన్ రెడ్డి ఒక నెల జీతం విరాళం. పీఎం-కేర్స్ నిధికి జీతంతోపాటు ఎంపీ లాడ్స్ నుంచి రూ. 1 కోటి కెటాయింపు. తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కి రూ. 50 లక్షల కేటాయింపు. మరో రూ. 50 లక్షలు హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌కు కేటాయిస్తూ లేఖలు.
  • మహారాష్ట్రను వణికిస్తున్న కరోనా. దేశంలో అత్యధికంగా మహారాష్ట్ర లో 335 కేసులు,13 మంది మృతి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే తో ఫోన్లో మాట్లాడిన ప్రధాని మోడీ. మహారాష్ట్రలో పరిస్థితులు కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలపై ఉద్దవ్ ఠాక్రేతో మాట్లాడిన మోడీ.

Crime : కోడి గురించి గొడవ.. కొడుకును చంపిన తండ్రి..

విజయనగరం జిల్లా బొద్దిడిలో దారుణ ఘటన జరిగింది. కోడి గురించి జరిగిన చిన్న ఘర్షణ..తండ్రి చేతిలోనే కొడుకు హత్యకు దారితీసింది.  గ్రామంలో నివశించే అడ్డాకుల మద్దేశ్వరరావు (22) అనే యువకుడికి కోడ్లు అంటే చాలా ఇష్టం.
Crime : Father Attacked Son Over Small Dispute In Andhra Pradesh, Crime : కోడి గురించి గొడవ.. కొడుకును చంపిన తండ్రి..

Crime :  విజయనగరం జిల్లా బొద్దిడిలో దారుణ ఘటన జరిగింది. కోడి గురించి జరిగిన చిన్న ఘర్షణ..తండ్రి చేతిలోనే కొడుకు హత్యకు దారితీసింది.  గ్రామంలో నివశించే అడ్డాకుల మద్దేశ్వరరావు (22) అనే యువకుడికి కోడ్లు అంటే చాలా ఇష్టం. దీంతో ఇంటి పెరట్లో తనకిష్టమైన ఓ జాతి కోడిని పెంచుకుంటున్నాడు. అయితే అతడి తండ్రి కాంతారావు..సదరు కోడిని తీసుకెళ్లి గ్రామ శివారులోని చెరువులో ముంచండంతో అది ఊపిరాడక మృత్యువాతపడింది. కొద్దిసేపటి తర్వాత ఇంటికొచ్చిన మద్దేశ్వరావుకి కోడి కనిపించకపోవడంతో ఆందోళన చెందాడు. వాకబు చేయగా..ప్రమాదవశాత్తూ మృతి చెందినట్టు తండ్రి సమాధానం ఇచ్చాడు. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ చెలరేగింది. కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయిన తండ్రి..పక్కనే ఉన్న కత్తితో కొడుకుపై దాడి చేశాడు. దీంతో అతడికి ఛాతిపై గాయాలై..అక్కడిక్కడే కూలిపోయాడు.

దీంతో కుంటుబ సభ్యులు వెంటనే మద్దేశ్వరరావును ఆస్పత్రికి తరలిస్తుండగా, అతడు మార్గమధ్యములో తనువు చాలించాడు. కొడుకు మరణవార్త తెలుసుకున్న కాంతారావు ఊర్లో నుంచి పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.

ఇది కూడా చదవండి : భార్య ప్రసవం కోసం ఆస్పత్రిలో..భర్త గుండెపోటుతో మృతి…

Related Tags