Crime News : 64 ఏళ్ల వ్యక్తి..22 ఏళ్ల అమ్మాయి..కృత్రిమ గర్భధారణ

 పంజాగుట్టలో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి(64) తనకు లేటు వయసులో సంతానం కావాలనుకున్నాడు. తన వంశాన్ని నిలబెట్టే ఒక కొడుకు ఉంటే బావుంటుందని ఫీల్ అయ్యాడు. అందుకు తగ్గట్టుగానే ప్రయత్నాలు మొదలెట్టాడు.

Crime News : 64 ఏళ్ల వ్యక్తి..22 ఏళ్ల అమ్మాయి..కృత్రిమ గర్భధారణ
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Feb 20, 2020 | 5:41 PM

Crime News :  పంజాగుట్టలో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి(64) తనకు లేటు వయసులో సంతానం కావాలనుకున్నాడు. తన వంశాన్ని నిలబెట్టే ఒక కొడుకు ఉంటే బావుంటుందని ఫీల్ అయ్యాడు. అందుకు తగ్గట్టుగానే ప్రయత్నాలు మొదలెట్టాడు. ఓ 22 ఏళ్ల అమ్మాయితో కృత్రిమ గర్భధారణకు ఒప్పందం కుదర్చుకున్నాడు. అయితే అందుకు సన్నాహాలు చేస్తుండగా..ఏం బుద్ది పుట్టిందో ఏమో..కృత్రిమ గర్బధారణ వద్దని, సహజంగానే పిల్లల్ని కందామంటూ..సదరు యువతిని వేధించడం మొదలెట్టాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది.

వివరాల్లోకి వెళ్తే.. స్వరూప రాజు 64 ఏళ్ల వ్యక్తి స్థానిక పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లోని ఆనంద్ నగర్‌లో నివాసం ఉంటున్నాడు. ఇతనికి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు.  అయితే కొడుకు కావాలనే ఉద్దేశంతో మధ్యవర్తి నూర్ ద్వారా 23 ఏళ్ల యువతితో కృత్రిమ గర్భధారణకు ఐదు లక్షల రూపాయలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. అదే విధంగా పిల్లాడు పుట్టే వరకు నెలకు రూ. 10,000 అగ్రిమెంట్ చేసుకున్నాడు.  కానీ అమ్మాయిని చూసిన తర్వాత స్వరూప రాజు ఆలోచన తీరు మారిపోయింది. ఒప్పందం ప్రకారం కృత్రిమ గర్భధారణ కాకుండా, సహజంగా పిల్లల్ని కనాలంటూ ఆమెపై ఒత్తిడి తీసుకొచ్చాడు. దీంతో వ్యవహారం పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు స్వరూప రాజును అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.