Breaking News
  • ఢిల్లీ భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. 2 లక్ష 26 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 226770. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 110960. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 109462. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 6348. . కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • టీవీ9 తో డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాసరావు. తెలంగాణలో కోవిడ్ కు సంబంధించి అన్ని సిధంగా ఉన్నాయి. ఎవ్వరు భయపడవలసిన అవసరం లేదు. డాక్టర్ల ను కాపాడుకుంటాం. రాష్ట్రంలో ఎడులక్షల ppe కిట్స్. N95మాస్కులు ఎనిమిది లక్షలు ఉన్నాయి.
  • అమరావతి లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపు నేపథ్యంలో ఈ నెల 8వ తేదీ నుంచి అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు తిప్పడానికి రంగం సిద్ధమవుతోంది. బస్సులు తిప్పడానికి అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వం పొరుగు రాష్ట్రాలను కోరింది. ఈ విషయంలో తమిళనాడు మినహా తెలంగాణ, కర్ణాటక, ఒడిశా ప్రభుత్వాలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని లేఖ రాశారు. ఏపీఎస్‌ ఆర్టీసీ కూడా అంతర్రాష్ట్ర సర్వీసులు తిప్పేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది.
  • ఢిల్లీ: ఢిల్లీలో మాస్కులేకుండా ఇళ్లనుంచి బయటకు వెళ్తే 500 రూపాయల జరిమాన. ఢిల్లీ పోలీసులకు ఆదేశాలు జారీ చేసిన లెఫ్ట్నెంట్ గవర్నర్. కరోనా కేసులు పెరుగుతున్నందున నేపథ్యంలో ఈ నిర్ణయం.
  • టిటిడి ఏఈవో ధర్మారెడ్డి కామెంట్స్. ఇతర రాష్ట్రాలతో ఉన్నవారు..ఆన్ లైన్లో తిరుమల దర్శన టికెట్ తీసుకున్నప్పటికీ..ఆ టికెట్..రాష్ట్రాల సరిహద్దుల వద్ద ఎంట్రీకి పనికిరాదు. వేరే రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ కి రావాలంటే ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ఇచ్చిన సూచనల మేరకు పాసులు తీసుకోవాలి. వీఐపీ బ్రేక్ దర్శనాలు సిఫార్స్ లేఖలు అనుమతించేది లేదు. ఎవరినీ దర్శనాలకి ఎవరికీ రికమండే షన్ పత్రాలు ఇవ్వొద్దు. ఎవరైతే వీఐపీలు ఉన్నారో వారికి మాత్రమే వీఐపీ బ్రేక్ దర్శనాలకి అనుమతిస్తాము.
  • విశాఖ: సుధాకర్ తల్లి కావేరీ భాయ్. సుధాకర్ కు, నాకు, సుధాకర్ కొడుకు లలిత్ ను సీబీఐ విచారించింది. నా కొడుకును చాలా బాధ పెట్టారు. ఆరోగ్యంగా ఉన్న వాడిని ఆసుపత్రిలో పెట్టి అనారోగ్యానికి పాలు చేశారు. నా బిడ్డకు జరిగిన ట్రీట్ మెంట్.. ఎవరికీ జరగకూడదు సుధాకర్ కు జరిగిన అన్యాయం అందరికీ తెలుసు.. కానీ భయపడి ఎవరూ నోరు విపొఅడం లేదు. పాలకులే కష్టాలు తెచ్చిపెడితే.. ఇంకా కష్టం ఎవరికి చెప్పుకోవాలి. ఇటువంటి ఘటన ఎవరికి జరిగినా నేను నిలబడతా.. వదిలిపెట్టను.

న్యాయం కోసం వెళితే.. చితక్కొట్టిన పోలీస్ బాస్..

Crime Incident In East Godavari District, న్యాయం కోసం వెళితే.. చితక్కొట్టిన పోలీస్ బాస్..

తూర్పుగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. తనకు న్యాయం చేయమని వస్తే.. న్యాయం చేయాల్సిన పోలీసులే అన్యాయంగా ప్రవర్తించిన ఘటన ఎటపాక మండలం కుసుమన పల్లిలో చోటుచేసుకుంది. గ్రామ వాలంటీర్‌గా పనిచేస్తున్న ఇరప కృష్ణవేణి అనే మహిళ తన భర్త వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్త వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని తనను చంపేస్తానని బెదిరిస్తున్నాడని తెలిపింది. భర్త నుంచి ప్రాణ హాని ఉందని.. తనని తన కొడుకుని కాపాడాలని కోరింది. అయితే ఫిర్యాదు చేసి మూడు నెలలు గడుస్తున్నా స్థానిక పోలీసులు పట్టించుకోకపోవడంతో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది.

దీంతో స్థానిక ఎస్సై చినబాబు ఎట్టకేలకు కేసు నమోదు చేశారు. అయితే బాధితురాలితో స్టేషన్ కి వచ్చిన.. ఆమె సోదరుడు రమేష్‌ని గదిలో పెట్టి చావబాదాడు. ఎస్సైకి ఫిర్యాదు చేశారా అంటూ విరుచుకుపడ్డాడు. తమకు న్యాయం చేయాలంటూ ఫిర్యాదు చేసినా పట్టించుకోని ఎస్సై.. తోడుగా వెళ్లిన బాధితురాలి సోదరుడి పై దాడి చేయడం అన్యాయం అని ఆదివాసీ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. న్యాయం కోసం పోలీసులను ఆశ్రయిస్తే న్యాయం చేయాల్సిన పోలీసులే దాడికి పాల్పడితే ఇంకెవరికి చెప్పుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేసినా పట్టించుకోని ఎస్సై ఉన్నతాధికారి ఫిర్యాదు చేస్తే ఏ పాపం ఎరుగని బాధితుల బంధువులను చితకబాదడం దుర్మార్గం అంటున్నారు. తక్షణమే ఎస్సై పై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

Related Tags