జార్ఖండ్‌: కొత్త ఎమ్మెల్యేల్లో 41 మందిపై క్రిమినల్ కేసులు!

జార్ఖండ్ ఎన్నికలకు సోమవారం ఫలితాలు ప్రకటించారు. అయితే కొత్తగా ఎన్నికైన 81 మంది ఎమ్మెల్యేలలో 41 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని తేలింది. 2019 జార్ఖండ్ ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేసే సమయంలో ఇచ్చిన డిక్లరేషన్లు, అఫిడవిట్ల ఆధారంగా ఈ కేసులు నిర్ధారించబడ్డాయి. 30 మంది జార్ఖండ్ ముక్తి మోర్చా ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఉండగా, కాంగ్రెస్‌లోని 16 మంది ఎమ్మెల్యేల్లో ఎనిమిది మందిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. 25 మంది బిజెపి ఎమ్మెల్యేలలో 11 మందిపై […]

జార్ఖండ్‌: కొత్త ఎమ్మెల్యేల్లో 41 మందిపై క్రిమినల్ కేసులు!
Follow us

| Edited By:

Updated on: Dec 27, 2019 | 1:49 AM

జార్ఖండ్ ఎన్నికలకు సోమవారం ఫలితాలు ప్రకటించారు. అయితే కొత్తగా ఎన్నికైన 81 మంది ఎమ్మెల్యేలలో 41 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని తేలింది. 2019 జార్ఖండ్ ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేసే సమయంలో ఇచ్చిన డిక్లరేషన్లు, అఫిడవిట్ల ఆధారంగా ఈ కేసులు నిర్ధారించబడ్డాయి. 30 మంది జార్ఖండ్ ముక్తి మోర్చా ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఉండగా, కాంగ్రెస్‌లోని 16 మంది ఎమ్మెల్యేల్లో ఎనిమిది మందిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. 25 మంది బిజెపి ఎమ్మెల్యేలలో 11 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. 2014 జార్ఖండ్ ఎన్నికలలో 81 మంది ఎమ్మెల్యేలలో 55 మందిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.

దీనిపై స్పందిస్తూ, కాంగ్రెస్ ప్రతినిధి అలోక్ దుబే, జెఎంఎం నాయకుడు బబ్లు పాండే.. ఒక వ్యక్తి దోషిగా తేలే వరకు ఎన్నికలలో పోటీ చేసే హక్కును కోల్పోలేరని అన్నారు. కాగా.. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) రాష్ట్ర కన్వీనర్ మాట్లాడుతూ జార్ఖండ్ ప్రజలు తమ ప్రతినిధులకు నేరపూరిత నేపథ్యం ఉందనే విషయంపై సరియైన అవగాహన లేదని తెలిపారు. ఓటర్లు కోరుకుంటున్నది వారి సమస్యలను, ఇబ్బందులను పరిష్కరించడం. అందువల్ల, ఈ పరిమితులను సాధారణంగా ఓటర్లు పట్టించుకోరు అని రాష్ట్ర కన్వీనర్ వివరించారు.

ఏడీఆర్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, జార్ఖండ్ ఎన్నికలలో 81 మంది ఎమ్మెల్యేలలో 53 మంది కోటీశ్వరులు ఉన్నారు. ఈ జాబితాలో జెఎంఎం చీఫ్ హేమంత్ సోరెన్, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రామేశ్వర్ ఓరన్, బిజెపికి చెందిన భాణ ప్రతాప్ షాహి మరియు పలువురు ప్రముఖ నాయకుల పేర్లు ఉన్నాయి.

విజయ్, ప్రశాంత్ నీల్ కాంబోలో మూవీ.. అసలు మ్యాటర్ ఇదే..
విజయ్, ప్రశాంత్ నీల్ కాంబోలో మూవీ.. అసలు మ్యాటర్ ఇదే..
మరికాసేపట్లో తెలంగాణ ఇంటర్‌ 2024 ఫలితాలు.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే!
మరికాసేపట్లో తెలంగాణ ఇంటర్‌ 2024 ఫలితాలు.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే!
ఈ పంటకు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు.. సాగు చేసే విధానం ఏంటి?
ఈ పంటకు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు.. సాగు చేసే విధానం ఏంటి?
పర్సనల్ లోన్ ప్రయోజనాలు..అప్రయోజనాలు ఏమిటి?
పర్సనల్ లోన్ ప్రయోజనాలు..అప్రయోజనాలు ఏమిటి?
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..