వేణుమాధవ్ మరణంపై క్రికెటర్ యూసఫ్ పఠాన్ భావోద్వేగం!

వేణు మాధవ్..ఈ పేరు తెలుగు చిత్ర పరిశ్రమలో ఎప్పటికి నిలిచిపోతుంది. తనకు మాత్రమే సాధ్యమైన సవరేట్ టైమింగ్‌తో ఈ కమెడియన్ సినిమా ప్రేమికులకు మరిచిపోలేని నవ్వులను పంచాడు. ఇప్పుడు వేణు దూరమైనా ఆయన చేసిన పాత్రలు మాత్రం ప్రేక్షకుల మదిలో ఎప్పటికీ నిలిచిపోతాయనేది వాస్తవం. కాగా వేణు మ‌ృతితో తెలుగు సినీ పరిశ్రమ దిగ్బ్రాంతికి గురైంది. కేవలం తెలుగులోనే కాకుండా దక్షణాది భాషలన్నింలోనూ ఆయన సత్తా చాటారు. అటువంటి నటుడు ఇప్పుడు లేడన్నది ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. దక్షిణాదికి […]

వేణుమాధవ్ మరణంపై క్రికెటర్ యూసఫ్ పఠాన్ భావోద్వేగం!
Follow us

|

Updated on: Sep 27, 2019 | 4:09 PM

వేణు మాధవ్..ఈ పేరు తెలుగు చిత్ర పరిశ్రమలో ఎప్పటికి నిలిచిపోతుంది. తనకు మాత్రమే సాధ్యమైన సవరేట్ టైమింగ్‌తో ఈ కమెడియన్ సినిమా ప్రేమికులకు మరిచిపోలేని నవ్వులను పంచాడు. ఇప్పుడు వేణు దూరమైనా ఆయన చేసిన పాత్రలు మాత్రం ప్రేక్షకుల మదిలో ఎప్పటికీ నిలిచిపోతాయనేది వాస్తవం. కాగా వేణు మ‌ృతితో తెలుగు సినీ పరిశ్రమ దిగ్బ్రాంతికి గురైంది. కేవలం తెలుగులోనే కాకుండా దక్షణాది భాషలన్నింలోనూ ఆయన సత్తా చాటారు. అటువంటి నటుడు ఇప్పుడు లేడన్నది ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు.

దక్షిణాదికి చెందిన పలువురు అగ్ర తారలు, సెలబ్రిటీలు వేణు మాధవ్ మృతిపై సంతాపం ప్రకటించారు. కానీ ఊహించని విధంగా ఏస్ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ తెలుగు కమెడియన్ మృతిపై స్పందించాడు.

‘వేణు మాధవ్ మరణం షాక్‌కు గురిచేసింది. నేను వెండితెరపై చూసిన భర్తిచేయలేని, గొప్ప నటుల్లో ఆయన ఒకరు. అతడి కుటుంబ సభ్యులకు, స్నేహితులకు నా ప్రగాడ సానుభూతి తెలియజేస్తున్నా’  అని యూసుఫ్ పఠాన్ ట్వీట్ చేశాడు.

ఇక యూసఫ్ ట్వీట్‌పై ఒక పాకిస్థానీ సినిమా అభిమాని వేసిన రీట్వీట్‌ను కూడా ఇక్కడ చర్చించాల్సిన అవసరం ఉంది.

వేణు మాధవ్ ఓ గొప్ప హాస్య నటుడని, నేను అతని సినిమాలు చాలా చూశానని, నేను, నా ఫ్రెండ్స్ ఇక్కడ తెలుగు, తమిళ సినిమాలనే ఎక్కువగా చూస్తామని, ఇష్టపడతామని చెప్పుకొచ్చాడు. బాలీవుడ్ సినిమాల కంటే వాళ్లు సినిమాలు బాగా తీస్తారని, కమిడియన్ల నటన కూడా చాలా బాగుంటుందని అభిప్రాయపడ్డారు.

‘అతడు గొప్ప నటుడు..పాకిస్థాన్‌లో ఆయన చిత్రాలు చాలా చూశాను. నేను, నా ప్రెండ్స్ బాలీవుడ్ చిత్రాల కంటే తెలుగు, తమిళ సినిమాలను ఇష్టపడతాం. దానికి కారణం యాక్షన్ సన్నివేశాలు, కమెడియన్ల నటన’ అని  అలీ అర్సల్ అనే పాకిస్థాని సినిమా అభిమాని ట్వీట్ చేశాడు.

తెలుగు సినిమాలు, మన నటులు ప్రపంచ వ్యాప్తంగా ఎంత ఇంపాక్ట్ చూపిస్తున్నారు అనడానికి ఈ సందర్భం ఒక ఉదాహారణ. సినిమాకు ఎల్లలు ఇలాంటివి విన్నప్పుడు నిజమనిపిస్తుంది. తెలుగు చిత్రాలను తక్కువచేసి మాట్లాడేవారికి, ఇక్కడి నటులను హేళనగా చూసేవారికి ఈ సందర్భం నిజంగా చెంపపెట్టు.

చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..