వైభవంగా క్రికెటర్‌ హనుమ విహారి వివాహం

cricketer hanuma vihari wedding in hanmakonda, వైభవంగా క్రికెటర్‌ హనుమ విహారి వివాహం

ఇండియన్ క్రికెట్ హనుమ విహరి మూడు మూళ్ల బంధంతో ఆదివారం ఓ ఇంటి వాడయ్యాడు. హన్మకొండలో ప్రీతిరాజ్‌తో అతని వివాహం ఘనంగా జరిగింది. హంటర్‌ రోడ్డులోని కోడెం కన్వెన్షన్‌ హాలులో అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకకు వర్ధన్నపేట ఎమ్మెల్యే రమేశ్, జిల్లాకు చెందిన పలు క్రీడా సంఘాల ప్రతినిధులు తదితరులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.

అరంగేట్ర మ్యాచ్‌లోనే ఆల్‌ రౌండ్‌ ప్రతిభతో ఇంగ్లండ్‌ జట్టుతో జరిగిన టెస్టు సిరీస్‌లో ఆకట్టుకున్న విహారి.. హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో వరంగల్‌కు చెందిన ప్రీతిరాజ్‌ను తొలిసారిగా కలుసుకున్నాడు. ఆ పరిచయం ప్రేమకు దారితీసింది. అనంతరం ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో ఆదివారం జరిగిన వివాహంతో వీరు ఒక్కటయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *