బోర్డుపై కోపంతో రోహిత్‌ కెరీర్‌ను పణంగా పెడుతున్నాడా?

బీసీసీఐపై పంతంనెగ్గడం కోసం కోసం రోహిత్‌శర్మ కెరీర్‌ను పణంగా పెడుతున్నాడా? ఐపీఎల్‌ కోసం తొందరపడొద్దని బీసీసీఐ చీఫ్‌ గంగూలీ చేసిన సూచనను పెడచెవిన ఎందుకు పెట్టినట్టు?

బోర్డుపై కోపంతో రోహిత్‌ కెరీర్‌ను పణంగా పెడుతున్నాడా?
Follow us

|

Updated on: Nov 04, 2020 | 2:09 PM

బీసీసీఐపై పంతంనెగ్గడం కోసం కోసం రోహిత్‌శర్మ కెరీర్‌ను పణంగా పెడుతున్నాడా? ఐపీఎల్‌ కోసం తొందరపడొద్దని బీసీసీఐ చీఫ్‌ గంగూలీ చేసిన సూచనను పెడచెవిన ఎందుకు పెట్టినట్టు? అసలు ఏం జరుగుతోంది? నిజంగానే రోహిత్‌శరన్మ గాయం బారిన పడ్డాడా? అయితే నిన్న హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎందుకు ఆడినట్టు? క్రికెట్‌ అభిమానుల మెదళ్లను తొలుస్తున్న ప్రశ్నలివి! ముంబాయి ఇండియన్స్‌కు సారథ్యం వహిస్తున్న రోహిత్‌శర్మ గాయం కారణంగా గత నాలుగు మ్యాచ్‌లు ఆడలేదు.. నిన్న హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రం ఆడాడు.. నిజానికి ఇదేం పెద్ద ప్రాధాన్యత ఉన్న మ్యాచేమీ కాదు.. పైగా టాస్‌ సమయంలో తాను ఫిట్‌గా చురుగ్గా ఉన్నానని చెప్పుకున్నాడు రోహిత్‌.. ఫిట్‌గా ఉంటే ఆసీస్‌ పర్యటనకు వెళ్లే జట్టులో ఎందుకు చోటు దక్కలేదో తెలియడం లేదు. రోహిత్‌శర్మ కండరాలలో చీలిక వచ్చిందని నిన్న గంగూలి అన్నాడు.. అయితే అక్టోబర్‌ 23న ముంబాయి ఇండియన్స్‌ ఇచ్చిన ప్రకటన మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది.. కండరాలు పట్టేశాయని మాత్రమే టీమ్‌ మేనేజ్‌మెంట్‌ చెప్పింది. ముంబాయి ఇండియన్స్‌ చెప్పింది నిజమైతే గంగూలీ చెప్పేది అబద్ధం కావాలి? లేదా గాయం ముదిరన్నా ముదరాలి. నిజంగానే చీలిక ఉంటే మాత్రం సీరియస్సే! బరిలో దిగే ఛాన్సే ఉండదు.. కానీ రోహిత్‌ శర్మ నిన్నటి మ్యాచ్ ఆడాడు. ఆసీస్‌ పర్యటనకు ఎంపిక చేయనప్పటి నుంచి రోహిత్‌ కాస్త కోపంగా ఉన్నాడు.. తాను ఫిట్‌గానే ఉన్నానని చాటి చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. టీమ్‌ సెలెక్షన్‌ ముగిసిన తర్వాత నెట్స్‌లో బ్యాటింగ్‌ చేస్తున్న వీడియో పెట్టడం, రోహిత్‌ ఫిట్‌గా లేడని రవిశాస్త్రి చెప్పిన రోజునే మరో వీడియో రిలీజ్‌ చేయడం, ఇప్పుడు గంగూలీ చేసిన వ్యాఖ్యకు కౌంటర్‌గా డైరెక్ట్‌గా మ్యాచే ఆడటం వెనుక ఉన్న ఉద్దేశం ఇదే! గాయం పెరిగితే కెరీర్‌కు దెబ్బ తగులుతుందని తెలిసీ రోహిత్‌ ఎందుకు రిస్క్‌ తీసుకుంటున్నాడు? ఎలాగూ ప్లే ఆఫ్‌ కన్‌ఫామ్‌ అయ్యింది.. పైగా పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉంది.. హైదరాబాద్‌లో ఓడినా పెద్దగా ఫరక్‌ పడదు.. అందుకే బౌల్డ్‌, బుమ్రాలకు విశ్రాంతినిచ్చారు.. మరి రోహిత్‌కు ఎందుకు విశ్రాంతి తీసుకోలేదు? ప్రాక్టీస్‌ అవుతుందన్న వాదనలో అర్థంపర్థం లేదు.. ఎందుకంటే అపారమైన అనుభవం ఉన్న రోహిత్‌కు ప్రాక్టీస్‌ అవసరమా? బీసీసీఐకి పాఠం చెప్పడానికే రోహిత్‌ ఇదంతా చేస్తున్నాడు. ఇప్పుడు కూడా ఐపీఎల్‌ ప్లే ఆఫ్స్‌ మ్యాచ్‌ల కోసం తీవ్రంగా ప్రాక్టీస్‌ చేస్తున్నాడు కూడా! అంటే రోహిత్‌ ఫిట్‌గా ఉన్నట్టేనా? ఏమో నిజానిజాలు బీసీసీఐ పెద్దలకెరుక!!