Breaking News
  • హైదరాబాద్: ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహ తయారీ పూజ ప్రారంభం. 66 వ సంవత్సరం మహావిష్ణువు రూపంలో దర్శానమివ్వనున్న ఖైరతాబాద్ గణనాధుడు. శ్రీ ధన్వంతరి నారాయణ మహా గణపతి గా నామకరణం. ఒక వైపు లక్ష్మిదేవి మరో వైపు సరస్వతి దేవి విగ్రహాలు ఏర్పాటు. పర్యావరణ హితంగా ఖైరతాబాద్ గణ నాధుడు. మట్టితో తయారు చేసి అదే ప్రదేశంలో నిమజ్జనం చేసేలా ఏర్పాటు. ఈ సారి 9 అడుగుల ఎత్తులో దర్శన మివ్వనున్న ఖైరతాబాద్ గణపతి. భక్తులు ఎవ్వరు రావద్దు ఆన్ లైన్ ద్వారా దర్శనము చేసుకోగలరని విజ్ఞప్తి చేసిన ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ.
  • వేర్‌హౌజ్‌లో నిల్వ చేసిన అమ్మోనియం నైట్రేట్. జాగ్రత్తలు తీసుకోకుండా నిల్వచేయడమే కారణమని లెబనాన్ అధ్యక్షుడు మైఖేల్ ఔన్ ట్వీట్. సమగ్ర దర్యాప్తు చేపట్టిన సుప్రీం డిఫెన్స్ కౌన్సిల్ . బాధ్యులపై తీవ్రమైన చర్యలు, కఠిన శిక్షలు అమలు చేస్తామని వెల్లడి . పేలుడు ధాటికి పూర్తిగా ధ్వంసమైన బీరుట్ పోర్ట్. అత్యవసర నిధి కింద 100 బిలియన్ లీరాలు విడుదల చేసిన లెబనాన్ అధ్యక్షుడు. లెబనాన్‌కి 240 కి.మీ దూరంలోని సైప్రస్ దీవుల వరకు వినిపించిన పేలుడు శబ్దాలు. పేలుళ్లు 3.4 తీవ్రత కల్గిన భూకంపాన్ని సృష్టించాయని నిపుణుల అంచనా. వ్యవసాయంలో ఎరువుగా ఉపయోగించే అమ్మోనియం నైట్రేట్‌కు నిప్పు తగిలితే అత్యంత తీవ్రతతో పేలుతుంది. పేలుడుతో నైట్రోజన్ ఆక్సైడ్, అమ్మోనియా వంటి విషవాయువులు విడుదల.
  • తిరుపతి...పేరూరు వకుళామాత ఆలయంలో చారిత్రాత్మిక శాసనం లభ్యం. 1101 వ శతాబ్దం కిచేందిన శాసనంగా గుర్తించిన పురావస్తు శాఖ అధికారులు. విష్ణు మూర్తి అలయంతో పాటు, అమ్మవారి ఆలయం ఉన్నట్టు చెప్తున్న శాసనం. టిటిడి ఇప్పటివరకు వకుళామాత ఆలయానికి సంభందించి ఎప్పుడు దొరకనట్టువంటి చారిత్రక ఆధారాలు.. తొలిసారిగా శాసనం బయటపడినా దానిపై పూర్తి సమాచారం సేకరిస్తున్న పురవస్తూశాఖ అధికారులు.
  • పేరూరు వకులమాత ఆలయంలో దొరికిన1101 శతాబ్దపు శాసనాలను పరిరక్షిస్తున్న అధికారులు. బండరాళ్లపై శాసనం ఉండటంతో దాని చుట్టూ కాంక్రీట్ దిమ్మను నిర్మిస్తున్న అధికారులు. వందల ఏళ్ల తర్వాత అమ్మవారి ఆలయానికి సంబంధించి దొరికి న శాసనం.
  • నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద. పూర్తిస్థాయి నీటిమట్టం : 590.00 అడుగులు. ప్రస్తుత నీటిమట్టం : 554.60 అడుగులు. ఇన్ ఫ్లో : 40,150 క్యూసెక్కులు. అవుట్ ఫ్లో : 2200 క్యూసెక్కులు. పూర్తిస్థాయి నీటి నిల్వ : 312.0405 టీఎంసీలు. ప్రస్తుత నీటి నిల్వ : 215.5430 టీఎంసీలు.
  • కాంగ్రెస్ సీనియర్ నేత మహారాష్ట్ర మాజీ సిఎం శివాజీరావు పాటిల్ నీలంగేకర్ పూణేలో కన్నుమూశారు.
  • చెన్నై విమానాశ్రయం లో భారీ గా పట్టుబడ్డ బంగారం , ఇద్దరు అరెస్ట్ . దుబాయ్ - షార్జా నుండి చెన్నై అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని గుర్తించినచిన కస్టమ్స్ అధికారులు . పట్టుబడ్డ 1 .48 కేజీల బంగారం విలువ 82 లక్షలు . చెన్నై కి చెందిన ఖలీల్ అహమద్ ,కాజా మొయిద్దీన్ అరెస్ట్ విచారణ చేపట్టిన కస్టమ్స్ అధికారులు.

పాక్ క్రికెట్ బోర్డుకు షాక్‌లు ఇస్తున్న క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా

, పాక్ క్రికెట్ బోర్డుకు షాక్‌లు ఇస్తున్న క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా

ముంబై: పుల్వామా ఉగ్రదాడి నేపధ్యంలో పాకిస్తాన్‌కు గట్టిగా బుద్ధి చెప్పాలని ఇప్పటికే యావత్‌ భారతావని ముక్తకంఠంతో డిమాండ్‌ చేస్తుంది. ఆ దిశగా ఒడిఒడిగా అడుగుల పడుతున్నాయి. క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా కూడా కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది.  పాక్‌తో క్రికెట్‌ మ్యాచ్‌లను మొత్తం నిషేధించాలనే ప్రతిపాదనను క్రికెట్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ) తెరపైకి తీసుకొచ‍్చింది. ఇప్పటికే బ్రాబోర్న్‌ స్టేడియంలో పాక్‌ క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌, ప్రస్తుత ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ఫొటోలను తొలగించింది సీసీఐ.మరొకవైపు  మొహాలి క్రికెట్‌ స్టేడియంలో ఉన్న 15 మంది పాకిస్తాన్‌ క్రికెటర్ల ఫొటోలను పంజాబ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (పీసీఏ) తొలగించింది.వరల్డ్‌కప్‌ వంటి మెగాటోర్నీలో సైతం పాక్‌తో క్రికెట్‌ మ్యాచ్‌ ఆడొద్దని భారత క్రికెట్ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ)కి విజ్ఞప్తి చేసింది.

, పాక్ క్రికెట్ బోర్డుకు షాక్‌లు ఇస్తున్న క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా

‘దాడి జరిగిన రోజు నుంచి ఇప్పటి వరకు ఈ ఘటనపై మాట్లాడటానికి ఆ దేశ ప్రధానిగా ఉన్న ఇమ్రాన్‌ ఖాన్‌ ముందుకు రాలేదు. దీనిపై ఇమ్రాన్‌ కనీసం స‍్పందించాల్సి ఉంది. సాటి మనిషిగా ఆయన ఈ చర్య పట్ల మాట్లాడాల్సిన అవసరం ఉంది. మన జవాన్ల మీద జరిగిన దాడిని మేం మూకుమ్మడిగా ఖండిస్తున్నాం. సీసీఐ క్రీడా రంగానికి చెందిందే కావచ్చు. కానీ మాకు దేశమే ముఖ్యం. తర్వాతే క్రీడలు. ఈ దాడిపై ఇమ్రాన్‌ ఖాన్‌ కచ్చితంగా మాట్లాడి తీరాలి. ఆయన పాకిస్తాన్‌ ప్రధాని. వాళ్ల దేశం వైపు ఏ తప్పూలేకపోతే ఆయన ఎందుకు మాట్లాడటం లేదు?..అందుకే వరల్డ్‌ కప్‌లో టీమిండియా..పాకిస్థాన్‌తో ఆడకూడదు. ఈ మేరకు బీసీసీఐని కోరాం’ అని సీసీఐ సెక్రటరీ సురేశ్‌ బఫ్నా తెలిపారు. త్వరలో ఆరంభమయ్యే వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా టీమిండియా-పాక్‌ల మధ్య జూన్‌ 16 న  మ్యాచ్‌ జరగాల్సి ఉంది.

Related Tags