కొట్టుకుపోయిన మూసీ గేటు.. ఆందోళనలో స్థానికులు..!

మూసీ నదిపై ఉన్న ఓ గేటు కొట్టుకుపోవడంతో.. భారీగా నీరు వృథా అవుతోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని కేతేపల్లి వద్ద మూసీ నదిపై జలాశయం ఉంది. అయితే గత వారం రోజులుగా హైదరాబాద్ నగరంలో భారీగా వర్షాలు కురుస్తుండటంతో.. వరద నీరు మూసీలో వచ్చి చేరింది. అయితే ఈ వరద ధాటికి జలశాయంలోని ఆరో నంబర్ గేటు శనివారం సాయంత్రం కొట్టుకుపోయింది. దీంతో ప్రాజెక్ట్‌లోని నీరంతా దిగువన ఉన్న మూసీ నదిలోకి వృథాగా వెళ్తోంది. కేతేపల్లి వద్ద […]

కొట్టుకుపోయిన మూసీ గేటు.. ఆందోళనలో స్థానికులు..!
Follow us

| Edited By:

Updated on: Oct 06, 2019 | 12:45 PM

మూసీ నదిపై ఉన్న ఓ గేటు కొట్టుకుపోవడంతో.. భారీగా నీరు వృథా అవుతోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని కేతేపల్లి వద్ద మూసీ నదిపై జలాశయం ఉంది. అయితే గత వారం రోజులుగా హైదరాబాద్ నగరంలో భారీగా వర్షాలు కురుస్తుండటంతో.. వరద నీరు మూసీలో వచ్చి చేరింది. అయితే ఈ వరద ధాటికి జలశాయంలోని ఆరో నంబర్ గేటు శనివారం సాయంత్రం కొట్టుకుపోయింది. దీంతో ప్రాజెక్ట్‌లోని నీరంతా దిగువన ఉన్న మూసీ నదిలోకి వృథాగా వెళ్తోంది.

కేతేపల్లి వద్ద ఉన్న జలాశయం సామర్ధ్యం 4.4 టీఎంసీలు. ఈ జలాశయానికి మొత్తం 8 రెగ్యులేటరీ గేట్లు, 12 క్రస్టు గేట్లు ఉన్నాయి. డెడ్‌ స్టోరేజీ నీటిని విడుదల చేసే రెగ్యులేటరీ గేట్లలో ఆరో నంబరు గేటు కొట్టుకుపోవడంతో.. జలాశయంలోని నీరంతా వృథాగా దిగువన ఉన్న నదిలోకి వెళ్లిపోతోంది. గేటు కొట్టుకుపోయే సమయానికి జలాశయంలో 4.3 టీఎంసీల నీరుంది. ఈ ప్రాజెక్టు పరిధిలో నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోని 42 గ్రామాల పరిధిలో 33 వేల ఎకరాలు సాగవుతోంది. డెడ్‌ స్టోరేజీ గేటు కొట్టుకు పోవడంతో జలాశయంలో నీరు అడుగంటే ప్రమాదం ఉందన్న ఆందోళన స్థానికుల్లో వ్యక్తమవుతోంది. సమాచారం తెలియడంతో మంత్రి జగదీశ్‌రెడ్డి ఘటనపై సమాచారం అడిగి తెలుసుకున్నారు. పైనుంచి వస్తున్న వరదను పూర్తి స్థాయిలో అంచనా వేయకపోవడం వల్లే గేటు కొట్టుకుపోయిందని నీటిపారుదల శాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. 2017లో ప్రభుత్వం విడుదల చేసిన రూ.18 కోట్లతో మరమ్మతులను చేపట్టారు. కానీ రెండేళ్లలోనే రెగ్యులేటరీ గేటు కొట్టుకుపోవడం పనుల్లో నాణ్యతను ప్రశ్నార్థకంగా మారుస్తోంది.